
వ్లాదివోస్టాక్ (రష్యా): రష్యా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ వరల్డ్ సూపర్–100 టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను జాతీయ మాజీ చాంపియన్ సౌరభ్ వర్మ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో జపాన్‌కు చెందిన కోకి వటనబేపై సౌరభ్ విజయం సాధించి.. పసిడిని సొంతం చేసుకున్నాడు. తొలి సెట్ 18-21తో కొల్పోయిన సౌరభ్.. ఆ తర్వాత తన అధిక్యాన్ని కనబరుస్తూ.. 21-12, 21-17లతో రెండు సెట్లను కైవసం చేసుకుని జయకేతనం ఎగరవేశాడు.
మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో రోహన్ కపూర్–కుహూ గార్గ్ జోడీ రన్నరప్‌గా నిలిచింది. వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా)–మిన్ యుంగ్ కిమ్ (కొరియా) జోడితో జరిగిన మ్యాచ్‌లో 19-21, 17-21తో వరుస సెట్లు కొల్పోవడంతో ఓటమి చవిచూసింది.
Comments
Please login to add a commentAdd a comment