Cyril Verma
-
సిరిల్ శుభారంభం
సౌరభ్ వర్మకు షాక్ న్యూఢిల్లీ: చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మిం టన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మ శుభారంభం చేశాడు. మం గళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో సిరిల్ 21–11, 10–21, 21–19తో వీ చి లియు (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. భారత ఆటగాళ్లు అభిషేక్, హర్షీల్ డాని కూడా తొలి రౌండ్లో గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ సౌరభ్ వర్మ (భారత్) తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. నాలుగో సీడ్ సౌరభ్ 19–21, 20–22తో లీ జియా (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌కే చెందిన రాహుల్ యాదవ్ తన ప్రత్యర్థి ఎన్ చియా చింగ్ (చైనీస్ తైపీ)కు ‘వాకోవర్’ ఇచ్చాడు. -
శ్రీకాంత్ శుభారంభం
ముల్హిమ్ ఎన్ డెర్ రుర్ (జర్మనీ): భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ జర్మన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశాడు. మంగళవారం రాత్రి పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో అతను 21–4, 21–11తో అలెన్ రోజ్ (స్లోవేకియా)పై సునాయాసంగా గెలిచాడు. తదుపరి రెండో రౌండ్లో 12వ సీడ్ శ్రీకాంత్... జపాన్‌కు చెందిన యుసుకె ఒనోడెరాతో తలపడతాడు. చైనా బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌కే చెందిన సిరిల్ వర్మ 13–21, 10–21తో ఓడిపోయాడు. శుభాంకర్ డే 16–21, 21–17, 21–19తో జన్పెంగ్ జావో (చైనా)పై గెలుపొందగా, క్వాలిఫయర్ హర్షిత్ అగర్వాల్ 18–21, 21–8, 21–16తో సెగున్ జోర్న్ (అమెరికా)ను కంగుతినిపించాడు. హర్షిల్ డాని 13–21, 12–21తో ఆరో సీడ్ చౌ తిన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో, రాహుల్ యాదవ్ 18–21, 18–21తో మిశా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్) చేతిలో ఓడారు. -
క్వార్టర్స్‌లో సిరిల్ వర్మ
పట్నా: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్ సిరిల్ వర్మ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిరిల్ వర్మ 21–19, 21–14తో పదో సీడ్ బోధిత్ జోషి (ఉత్తరాఖండ్)పై గెలుపొందాడు. అంతకుముందు మూడో రౌండ్లో సిరిల్ 24–22, 21–10తో నీరజ్ వశిష్ట్ (రైల్వేస్)ను ఓడించాడు. తెలంగాణకే చెందిన రాహుల్ యాదవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–17, 21–23, 11–21తో డానియల్ ఫరీద్ (కర్ణాటక) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ విభాగంలో తెలుగు అమ్మాయిలు శ్రీకృష్ణప్రియ, ప్రమద, సాయి ఉత్తేజిత రావు మూడో రౌండ్లో పరాజయం పాలయ్యారు. -
సెమీస్‌లో రుత్విక, సిరిల్
న్యూఢిల్లీ: రష్యా ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్‌కు చెందిన గద్దె రుత్విక శివాని, సిరిల్ వర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రుత్విక శివాని 13-21, 21-10, 21-17తో ఎలీనా కొమెన్డ్రోవ్స్కా (రష్యా)ను ఓడించగా... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సిరిల్ వర్మ 21-12, 21-18తో జుల్హెల్మీ జుల్కిఫి (మలేసియా)పై గెలుపొందాడు. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి సిక్కిరెడ్డి తన భాగస్వామి ప్రణవ్ చోప్రాతో కలిసి సెమీస్‌లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో సిక్కి-ప్రణవ్ ద్వయం 21-10, 21-8తో వాసిల్కిన్-క్రిస్టినా విర్విచ్ (రష్యా) జోడీపై గెలిచింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన తన్వీ లాడ్ 16-21, 19-21తో ఎవగెనియా కొసెట్‌స్కాయ (రష్యా) చేతి లో ఓడిపోయి0ది. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో అనతోలి యార్ట్‌సెవ్-ఎవగెనియా కొసెట్‌స్కాయ (రష్యా) జంటతో సిక్కి రెడ్డి-ప్రణవ్ జోడీ; సెనియా పొలికర్పోవా (రష్యా)తో రుత్విక శివాని; అనతోలి యార్ట్‌సెవ్ (రష్యా)తో సిరిల్ వర్మ తలపడతారు. -
క్వార్టర్స్‌లో శివాని, సిరిల్ వర్మ
బాంకాంగ్: రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రిలో వర్ధమాన బ్యాడ్మింటన్ క్రీడాకారులు గద్దె రుత్విక శివాని, తన్వీ లాడ్, సిరిల్ వర్మ క్వార్టర్స్‌కు చేరారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ శివాని 21-9, 21-10 తేడాతో అరుంధతిపై గెలిచింది. తన్వీ 21-10, 21-13తో ఎకటేరినా కుట్ (రష్యా)పై నెగ్గగా... పురుషుల సింగిల్స్‌లో సిరిల్ వర్మ 21-15, 21-9తో మూడో సీడ్ మిషా జిల్బెర్బన్ (ఇజ్రాయెల్)పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్, సిక్కి రెడ్డి జంట కూడా క్వార్టర్స్‌కు చేరింది. -
నంబర్‌వన్ సిరిల్
న్యూఢిల్లీ: తెలుగు కుర్రాడు అల్లూరి శ్రీసాయి సిరిల్ వర్మ జూనియర్ బ్యాడ్మింటన్‌లో కొత్త ఘనతను సాధించాడు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) గురువారం ప్రకటించిన తాజా జూనియర్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సిరిల్ నంబర్‌వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. 2014 జనవరిలో ఆదిత్య జోషి నంబర్‌వన్‌గా నిలిచాక... అగ్రస్థానానికి చేరిన రెండో భారతీయుడు సిరిల్. గత నవంబర్‌లో జరిగిన జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించి సిరిల్ సంచలనం సృష్టించాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ విజయంతో సిరిల్‌కు 5100 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. దాంతో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి అతను నంబర్‌వన్ అయ్యాడు. గత కొంత కాలంగా జూనియర్ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఈ కుర్రాడు 2013లో ఆసియా అండర్-15 విజేతగా నిలిచాడు. అనంతరం అదే ఏడాది ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో కూడా టైటిల్ సొంతం చేసుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ కాంస్యం, జాతీయ అండర్-17 చాంపియన్‌షిప్‌తో పాటు పలు ర్యాంకింగ్ టైటిల్స్ అతని ఖాతాలో ఉన్నాయి. 16 ఏళ్ల సిరిల్ ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. తమ కుమారుడు నంబర్‌వన్ కావడం పట్ల అతని తల్లిదండ్రులు విజయరామరాజు, సుశీల సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అతను మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు వారు చెప్పారు.