శ్రీకాంత్‌ శుభారంభం | German Open Grand Prix Gold badminton tournament | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్‌ శుభారంభం

Mar 1 2017 11:58 PM | Updated on Sep 5 2017 4:56 AM

శ్రీకాంత్‌ శుభారంభం

శ్రీకాంత్‌ శుభారంభం

ముల్హిమ్‌ ఎన్‌ డెర్‌ రుర్‌ (జర్మనీ): భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌ జర్మన్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో

ముల్హిమ్‌ ఎన్‌ డెర్‌ రుర్‌ (జర్మనీ): భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌ జర్మన్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుభారంభం చేశాడు. మంగళవారం రాత్రి పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో అతను 21–4, 21–11తో అలెన్‌ రోజ్‌ (స్లోవేకియా)పై సునాయాసంగా గెలిచాడు. తదుపరి రెండో రౌండ్లో 12వ సీడ్‌ శ్రీకాంత్‌... జపాన్‌కు చెందిన యుసుకె ఒనోడెరాతో తలపడతాడు.

చైనా బ్యాడ్మింటన్‌ దిగ్గజం లిన్‌ డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌కే చెందిన సిరిల్‌ వర్మ 13–21, 10–21తో ఓడిపోయాడు. శుభాంకర్‌ డే 16–21, 21–17, 21–19తో జన్‌పెంగ్‌ జావో (చైనా)పై గెలుపొందగా, క్వాలిఫయర్‌ హర్షిత్‌ అగర్వాల్‌ 18–21, 21–8, 21–16తో సెగున్‌ జోర్న్‌ (అమెరికా)ను కంగుతినిపించాడు. హర్షిల్‌ డాని 13–21, 12–21తో ఆరో సీడ్‌ చౌ తిన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో, రాహుల్‌ యాదవ్‌ 18–21, 18–21తో మిశా జిల్బెర్మన్‌ (ఇజ్రాయెల్‌) చేతిలో ఓడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement