
న్యూఢిల్లీ: గాయం కారణంగా చైనా, హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లకు దూరమైన భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో మాత్రం ఒక స్థానం మెరుగయ్యాడు. గురువారం తాజాగా విడుదల చేసిన జాబితాలో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత వారం టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన యువ షట్లర్ లక్ష్యసేన్ తొలిసారి టాప్–100లో చోటు దక్కించుకున్నాడు.
ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న ఈ 16 ఏళ్ల యువ సంచలనం 19 స్థానాలు ఎగబాకి 89వ ర్యాంకుకు చేరుకున్నాడు. హెచ్‌ఎస్ ప్రణయ్ 10వ ర్యాంకును, బి. సాయి ప్రణీత్ 17 ర్యాంకును నిలబెట్టుకున్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు మూడో ర్యాంకులో, సైనా నెహ్వాల్ పదో ర్యాంకులోనే కొనసాగుతున్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్– సిక్కి జోడి 19వ ర్యాంకులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment