సెమీస్‌లో రాహుల్‌ ఓటమి | rahul loss match in semi final | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో రాహుల్‌ ఓటమి

Published Sun, Jul 23 2017 2:59 AM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM

rahul loss match in semi final

న్యూఢిల్లీ: రష్యా ఓపెన్‌ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ చిట్టబోయిన రాహుల్‌ యాదవ్‌ సంచలన ప్రదర్శన ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో 19 ఏళ్ల రాహుల్‌ యాదవ్‌ 11–5, 10–12, 11–7, 6–11, 8–11తో రెండో సీడ్‌ వ్లాదిమిర్‌ మల్కోవ్‌ (రష్యా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌ సెమీస్‌లో అర్జున్‌–శ్లోక్‌ రామచంద్రన్‌ జంట 3–11, 2–11, 4–11తో ఇవనోవ్‌–సొజోనోవ్‌ (రష్యా) జోడీ చేతిలో ఓటమి పాలైంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement