సలాలా (ఒమన్): ఆసియా కప్ హాకీ ఫైవ్స్ టోర్నమెంట్‌లో భారత పురుషుల హాకీ జట్టు విజేతగా నిలిచింది. ఐదుగురు సభ్యులు ఆడే ఈ టోర్నీని ఈ ఏడాదే ప్రారంభించగా... శనివారం జరిగిన ఫైనల్లో భారత్ ‘షూటౌట్’లో 2–0తో పాకిస్తాన్‌పై గెలిచింది. చాంపియన్‌గా నిలిచిన భారత్ వచ్చే ఏడాది జరిగే హాకీ ఫైవ్స్ ప్రపంచకప్‌కు అర్హత సంపాదించింది. తుదిపోరులో నిర్ణీత సమయంలో రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి.
భారత జట్టులో మొహమ్మద్ రహీల్ (19వ, 26వ ని.లో), జుగ్‌రాజ్ సింగ్ (7వ ని.లో), మణిందర్ సింగ్ (10వ ని.లో) గోల్స్ చేశారు. పాక్ తరఫున రెహా్మన్ (5వ ని.లో), అబ్దుల్ (13వ ని.లో), హయత్ (14వ ని.లో), అర్షద్ (19వ ని.లో) గోల్ చేశారు. విజేతగా నిలిచిన భారత జట్టులోని సభ్యులకు రూ. 2 లక్షలు చొప్పున, శిక్షణ సహాయక సిబ్బందికి రూ. ఒక లక్ష చొప్పున హాకీ ఇండియా నగదు పురస్కారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment