భారత్ శుభారంభం
బంగ్లాదేశ్‌పై 13–1 గోల్స్‌తో విజయం
మస్కట్ (ఒమన్): జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో జ్యోతి సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 13–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది.
భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముంతాజ్ ఖాన్ (27వ, 32వ, 53వ, 58వ నిమిషాల్లో) అత్యధికంగా నాలుగు గోల్స్ సాధించింది. కనిక (12వ, 51వ, 52వ నిమిషాల్లో), దీపిక (7వ, 20వ, 55వ నిమిషాల్లో) మూడు గోల్స్ చొప్పున చేశారు. బ్యూటీ డుంగ్‌డుంగ్ (33వ నిమిషంలో), మనీషా (10వ నిమిషంలో), వైస్ కెప్టెన్ సాక్షి రాణా (43వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు.
బంగ్లాదేశ్ జట్టుకు ఒర్పితా పాల్ (12వ నిమిషంలో) ఏకైక గోల్ అందించింది. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు 12 పెనాల్టీ కార్నర్‌లు లభించగా... నాలుగింటిని గోల్స్‌గా మలిచింది. ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను వృధా చేసింది. అన్ని పెనాల్టీ కార్నర్‌లను టీమిండియా సది్వనియోగం చేసుకొనిఉంటే విజయం తేడా మరింత భారీగా ఉండేది. నేడు జరిగే తమ రెండో లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment