Mumtaz
-
మా అమ్మ బతికే ఉంది: నటి
సాక్షి, ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటి ముంతాజ్ మరణ వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె కుమార్తె, నటి కమ్ మోడల్ అయిన తన్యా మద్వాని స్పందించారు. ‘మా అమ్మ గురించి ఏవేవో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె చనిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. అది రూమర్. ఆమె బతికే ఉంది. ఆమె ఆరోగ్యవంతంగా ఉన్నారు. నాతోపాటే ఉంటూ షాపింగ్‌లు చేస్తూ.. తన పనులను ఆమె చేసుకుంటున్నారు అని తన్యా వివరణ ఇచ్చారు. ఓ వీడియో సందేశాన్ని, ముంతాజ్ ఫోటోను తన్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. 70 ఏళ్ల ముంతాజ్.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సోనె కి చిదియాతో కెరీర్‌ను ప్రారంభించారు. దో రాస్తే.. బంధన్.. మేలా, అపరాధ్, నాగిన్ తదితర చిత్రాలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఖిలోనా(1970) చిత్రంలో వేశ్య పాత్రకు ప్రశంసలతోపాటు.. ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డు దక్కింది. 1977 తర్వాత చిత్రాలకు దూరమైన ఆమె.. చివరగా 1990లో ఆందియాన్లో కనిపించారు. ప్రస్తుతం ఆమె కూతురితోపాటు ఇటలీలో ఉన్నట్లు తెలుస్తోంది. Rumor about my mother’s death ! Not true. #mumtaz #bollywood #press #actress #mumtazactress A post shared by Tanya Madhvani (@tanyamadhvani) on Apr 28, 2018 at 2:57am PDT -
జైలు నుంచి పాక్ అక్కాచెల్లెళ్ల విడుదల
అమృత్సర్: మాదక ద్రవ్యాల కేసులో కటకటాలపాలైన పాకిస్థాన్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు ఫాతిమా, ముంతాజ్‌లు గురువారం విడుదలయ్యారు. వారితోపాటు 11 ఏళ్ల హీనాకు కూడా మోక్షం లభించింది. శిక్షాకాలంలో ఫాతిమాకు హీనా జన్మిచింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుపై భారత ప్రధాని నరేంద్రమోదీప్రత్యేకశ్రద్ధ తీసుకున్నారని తమకు తెలిసిందని, అందువల్ల ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారతమాతకు వందనం చేస్తున్నాం’ అని విడుదల అనంతరం ఫాతిమా ఉద్వేగంగా తెలియజేసింది. తమ దేశానికి వెళ్లే ముందు స్వర్ణదేవాలయాన్ని సందర్శించాలని అభిలషిస్తున్నట్టు చెప్పారు. కాగా పాకిస్థాన్‌లో మాదకద్రవ్యాలు తీసుకుని భారత్‌లో చొరబడేందుకు యత్నిస్తుండగా 2006, మే ఎనిమిదో తేదీన అట్టారి అంతర్జాతీయ సరిహద్దు వద్ద భద్రతా బలగాలు అరెస్టు చేయడం తెలిసిందే. -
‘గురు’తో నేను కొత్త నటుణ్ణి
‘‘30 ఏళ్లుగా నటిస్తున్నా, ఎన్నో చిత్రాలు చేశా. అవార్డులు అందుకున్నా. అయితే, ఎప్పుడూ పూర్తి కథను చదవలేదు. కానీ, ‘గురు’ కథను పూర్తిగా చదవమని సుధ చెప్పారు. సరేనని చదవడం మొదలుపెడితే... నాలో ఏదో తెలియని శక్తి వచ్చింది. ఈ సినిమాతో నేను ఓ కొత్త నటుణ్ణి అనిపించింది’’ అని వెంకటేశ్ అన్నారు. వెంకటేశ్ హీరోగా సుధ కొంకర దర్శకత్వంలో ఎస్. శశికాంత్ నిర్మించిన సినిమా ‘గురు’. రితికా సింగ్, ముంతాజ్, నాజర్ ముఖ్యతారలు. సోమవారం ట్రైలర్ విడుదల చేశారు. వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘ఈ కథ విన్నప్పుడు డెంగీ జ్వరం రావడంతో చేయలేకపోయా. తమిళం, హిందీ భాషల్లో సినిమా తీసిన తర్వాత నాకు కుదిరింది. గత చిత్రాలకంటే ఇందులో బాగా లీనమై నటించా. నా డైలాగ్ డెలీవరీ, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటాయి. ఈ సినిమాలో మాత్రమే నేను గురు. షూటింగ్లో మాత్రం నా గురు సుధానే. తనకి నేను స్టూడెంట్ అయిపోయా. ఈ సినిమాలో ఓ ట్యూన్ వినగానే చాలా ఎగ్జయిట్‌గా అనిపించి పాట పాడా. సంతోశ్ మంచి పాటలిచ్చారు’’ అన్నారు. సుధ కొంగర మాట్లాడుతూ– ‘‘గురు’ కథ అనుకున్నప్పుడు ఫస్ట్ మణిరత్నంగారిని సంప్రదించా. నాలుగైదేళ్లు బాక్సింగ్‌పై పరిశోధన చేసి, 250 మంది బాక్సర్లను కలిసి కథ రెడీ చేశా. వెంకీగారిని కలిసి బాక్సింగ్ నేపథ్యం అనగానే చాలా ఎక్జైట్ అయ్యారు. ఆయన కమిట్మెంట్, సిన్సియారిటీ నాకు నచ్చింది. ఆయన టైమ్ అంటే టైమే. ఆయనతో పనిచేయడం చాలా ఎగ్జయిటింగ్ ఉంది. బాక్సర్ రితిక 2010 నుంచి నాతో ట్రావెల్ అవుతోంది. ముంతాజ్ కూడా బాక్సర్.. ఇద్దరూ సిస్టర్స్‌గా యాక్ట్ చేశారు. నిర్మాత శశికాంత్ చాలా ఫ్రీడమ్ ఇవ్వడంతో క్వాలిటీ సినిమా వచ్చింది’’ అన్నారు. ‘‘వెంకీ సార్‌ని చూస్తే నా రియల్ గురు గుర్తుకొచ్చారు. ఈ చిత్రం చూశాక చాలా మంది స్ఫూర్తి పొందుతారు’’ అన్నారు రితికా సింగ్. శశికాంత్, ముంతాజ్, సంగీత దర్శకుడు సంతోశ్ నారాయణన్, పాటల రచయిత భాస్కర భట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రాడ్యూసర్ రామ్ తదితరులు పాల్గొన్నారు. -
జూలై 31న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: శరత్‌బాబు (నటుడు); ముంతాజ్ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యునికి సంబంధించినది. మీ పుట్టిన తేదీ 31. (3+1=4). ఇది రాహువుకి సంబంధించిన సంఖ్య. రాహు, సూర్యుల కలయిక వల్ల ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక మైలురాయి వంటిదని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అవివాహితులకు వివాహ యోగం, పిల్లలకు ఉద్యోగ, వివాహ ప్రాప్తి జరుగుతుంది. ట్రాన్స్ఫర్లకోసం ఎదురు చూసేవారికి కోరుకున్న చోటికి ట్రాన్స్ఫరవుతుంది. కొత్త వ్యాపారాలు విస్తరించడానికి ఇది అనుకూల సమయం. సంవత్సరం తలపెట్టిన ఏ కార్యమైనా మీకు జీవితంలో మంచి ఆదాయాన్నిస్తుంది. స్నేహితులతో, అధికారులతో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, సత్సంబంధాలు ఏర్పడతాయి. విదేశీవిద్య, ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న గ్రీన్‌కార్డ్ ఈ సంవత్సరం కచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. లక్కీ నంబర్స్: 1,4,5,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డ్, రోజ్, ఆరంజ్, బ్రౌన్; లక్కీడేస్: ఆది, సోమ, బుధ, శుక్రవారాలు; లక్కీ మంత్స్: జనవరి, ఏప్రిల్, జులై, సెప్టెంబర్; సూచనలు: హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల మెడికల్ చెకప్ చేయించుకోవడం మంచిది. రాహుజపం చేయించడం, వికలాంగులను, అంధులను ఆదుకోవడం, కోతులకు అరటిపండ్లు పెట్టడం, తండ్రి తరఫు వారిని ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
అపురూపం: చెక్కు చెదరని జ్ఞాపకాల మందిరం
తాజ్‌మహల్! ప్రపంచ వింతల్లో ఒకటి! ఒక భర్త తన భార్య గుర్తుగా ఇంత భారీగా కట్టించిన మహల్ భువిపై ఇంకొకటి లేదు! మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు భార్య ముంతాజ్ అంటే ఎంతో ప్రేమ! ఆమె 1631లో పరమపదించారు. ఆమె గుర్తుగా తాజ్‌మహల్‌ని కట్టారు షాజహాన్! ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో... యమునా నదీ తీరాన... పూర్తిగా పాలరాయితో... వెయ్యి ఏనుగుల సాయంతో... ఇరవై వేల మంది కార్మికులు ఇరవై రెండేళ్ల పాటు శ్రమించి నిర్మించిన అతిగొప్ప కట్టడమిది! కట్టి శతాబ్దాలు అవుతోంది. అయినా దాని వన్నె తగ్గలేదు. కనీసం ఒక్కసారైనా ఆ మహాకట్టడాన్ని చూడాలని ఉబలాటపడేవారే అందరూ! సినీ తారలూ దీనికి మినహాయింపు కాదు! నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శ్రీమతి అన్నపూర్ణ దంపతులు తాజ్‌మహల్‌ను సందర్శించుకున్నప్పటి ఫొటోని పైన చూడవచ్చు! అలాగే ఢిల్లీలో జరిగిన జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మహానటి సావిత్రి, ప్రఖ్యాత నటుడు శివాజీ గణేశన్, వారి అర్థాంగి కమలా గణేశన్ ప్రత్యేకంగా ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్‌ని దర్శించుకున్నప్పటి స్టిల్ కూడా. అలాగే నేటి హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తన శ్రీమతి లక్ష్మితో కలిసి తాజ్‌మహల్ ముందు తీపిగుర్తుగా తీయించుకున్న స్టిల్. అమెరికా అధ్యక్షుడైనా అతి సామాన్యుడైనా తాజ్‌మహల్ అందాలకు ముగ్ధుడవ్వాల్సిందే. ఆ నిర్మాణానికి ఆశ్చర్యపోవాల్సిందే. దాని ముందు ఫొటో దిగాల్సిందే! ఎందుకంటే... తాజ్‌మహల్ వంటి దృశ్యకావ్యం మరొకటి లేదు గనుక! వేరొకటి సాటి రాదు గనుక!! ఇంకొకటి కట్టలేరు గనుక!!! - సంజయ్ కిషోర్