కూతుళ్లతో ముంతాజ్ (పాత చిత్రం)
సాక్షి, ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటి ముంతాజ్ మరణ వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె కుమార్తె, నటి కమ్ మోడల్ అయిన తన్యా మద్వాని స్పందించారు. ‘మా అమ్మ గురించి ఏవేవో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె చనిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. అది రూమర్. ఆమె బతికే ఉంది. ఆమె ఆరోగ్యవంతంగా ఉన్నారు. నాతోపాటే ఉంటూ షాపింగ్‌లు చేస్తూ.. తన పనులను ఆమె చేసుకుంటున్నారు అని తన్యా వివరణ ఇచ్చారు. ఓ వీడియో సందేశాన్ని, ముంతాజ్ ఫోటోను తన్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
70 ఏళ్ల ముంతాజ్.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సోనె కి చిదియాతో కెరీర్‌ను ప్రారంభించారు. దో రాస్తే.. బంధన్.. మేలా, అపరాధ్, నాగిన్ తదితర చిత్రాలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఖిలోనా(1970) చిత్రంలో వేశ్య పాత్రకు ప్రశంసలతోపాటు.. ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డు దక్కింది. 1977 తర్వాత చిత్రాలకు దూరమైన ఆమె.. చివరగా 1990లో ఆందియాన్‌లో కనిపించారు. ప్రస్తుతం ఆమె కూతురితోపాటు ఇటలీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment