rumour
-
విడాకులు ఫిక్స్..?
-
లవ్‌లో పడిన కీర్తి సురేశ్.. 13 ఏళ్లుగా అతనితో!
టాలీవుడ్‌తో పాటు తమిళంలో ఫేమ్ సంపాదించిన నటి కీర్తి సురేశ్. దక్షిణాదిలో అగ్ర హీరోయిన్లలో ఆమె ఒకరు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మపై సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరలవుతున్నాయి. కీర్తి సురేశ్ పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె చిన్ననాటి స్నేహితుడితో ప్రేమలో ఉందని గాసిప్స్ గుప్పమంటున్నాయి. దాదాపు 13 ఏళ్ల నుంచి వీరిద్దరూ సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. అతను ఓ వ్యాపారవేత్త అని.. కేరళలో రిసార్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భామ ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని సమాచారం. మరో నాలుగేళ్ల తర్వాతే వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కీర్తి సురేశ్ పెళ్లిపై గతంలోనూ ఇలాంటి ప్రచారం పెద్దఎత్తున జరిగింది. కోలీవుడ్‌కు చెందిన స్టార్ మ్యూజిక్ కంపోజర్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే.. అవన్నీ తప్పుడు ప్రచారమని ఆమె కుటుంబసభ్యులు తోసిపుచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికే ఆమెకు ఓ వ్యాపారవేత్తతో పెళ్లి కుదిరినట్లు వార్తలొచ్చాయి. అయితే మరోసారి కీర్తి సురేశ్ ప్రేమ వార్తలు రావడంతో.. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. అయితే ఈ ఇలాంటి వార్తలపై నటి ఇంతవరకు స్పందించలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కీర్తి సురేశ్.. నానితో కలిసి ‘దసరా’, మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్‌లో కనిపంచనున్నారు. వీటితోపాటు పలు తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. -
అఖిల్ 'ఏజెంట్' మూవీ ఆగిపోయిందా? ట్వీట్‌తో క్లారిటీ
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఏజెంట్'. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వంటి హిట్టు మూవీ తర్వాత అఖిల్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: చై-సామ్ విడాకుల తర్వాత.. ఫస్ట్ గ్రూప్ ఫోటో ఇదే! నిర్మాత అనిల్ సుంకరతో ఏర్పడిన అభిప్రాయ బేధాల వల్ల డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని, దీంతో సినిమా ఆగిపోయిందంటూ కూడా నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.తాజాగా ఈ వార్తలపై నిర్మాత అనిల్ సుంకర సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. 'ఏజెంట్ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలోనే మనాలీలో ప్రారంభమవుతుంది. త్వరలోనే టీజర్ అప్డేట్ ఇస్తాం. దయచేసి అఫీషియల్ ట్వీట్స్ మాత్రమే ఫాలో అవ్వండి. రూమర్స్ గురించి పట్టించుకోవద్దు' అంటూ స్పష్టతనిచ్చారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌కి చెక్ పెట్టినట్లయ్యింది. చదవండి: 'షూటింగ్ ఆపేశారు.. నన్ను వాష్‌రూంలో పెట్టి బంధించారు' #AGENT schedule starting in Manali. An update abt teaser will be given shortly. Please only follow verified twitter handles for updates. Ignore all the rumours please. 🙏🙏🙏 — Anil Sunkara (@AnilSunkara1) May 16, 2022 -
ప్రభాస్‌పై ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన పీఆర్ టీమ్
హీరో ప్రభాస్ కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారంటూ వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. బ్లాక్ ఫిలింతో పాటు కాలం చెల్లిన ఎంపీ స్టిక్కర్‌ను వేసుకున్నందుకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రూ. 1600 జరిమానా విధించారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అసలు విషయం బయటికి వచ్చింది. నిజానికి అది ప్రబాస్ కారు కాదంట. ఈ మేరకు ప్రభాస్ పీఆర్ టీం స్పష్టతనిచ్చింది. హైదరాబాద్ రోడ్ నెంబర్ 36లో ప్రభాస్ కారుకి పోలీసులు ఫైన్ వేశారని వార్తలు వస్తున్నాయి. ఆ కారుకి, ప్రభాస్‌కి ఏ విధమైన సంబంధం లేదని తెలియజేస్తున్నాం. దయచేసి గమనించగలరు అని పీఆర్ టీం చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ ఫేక్ న్యూస్‌పై ప్రభాస్ వ్యక్తిగత సహాయకుడు రామకృష్ణ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించారు. కారు ప్రభాస్ పేరు మీద లేదని, ఆయన బంధువు నరసింహరాజు పేరు మీద ఉందంటూ దానికి సంబంధించిన పత్రాలను సమర్పించారు. దీంతో రూమర్స్‌కి చెక్పెట్టినట్లయ్యింది. కాగా సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిన ప్రభాస్ త్వరలోనే భారత్‌కు రానున్నారు. అనంతరం ఆయన సలార్ షూటింగ్లో పాల్గొంటారు. చదవండి: పెళ్లిపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు -
రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో ?
Is Hrithik Roshan And Saba Azad Getting Married Soon: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సబా ఆజాద్ అనే యంగ్ హీరోయిన్గా డేటింగ్లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవలే ముంబైలో వీరిద్దరూ డిన్నర్ డేట్‌కు వెళ్లిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో వీళ్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ స్టార్ట్ అయ్యిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మొన్నటికి మొన్న హృతిక్ ఫ్యామిలీతో కలిసి సబా ఆజాద్ లంచ్ చేయడం ఆ వార్తలకి మరింత బలం చేకూరినట్లయ్యింది. అయితే తాజాగా మరో వార్త బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఈ అందగాడు మరోసారి పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2014లో పరస్పర అంగీకారంతో సుస్సన్నే ఖాన్ నుంచి విడాకులు తీసుకున్నాడు హృతిక్ రోషన్. తర్వాత బీటౌన్ బ్యూటీ సబా ఆజాద్‌తో హృతిక్‌కు పరిచయం ఏర్పడింది. వరిద్దరూ గత కొంతకాలంగా సన్నిహింతగా ఉన్నట్లు తెలిపే ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులు, పిల్లలకు సబాను పరిచయం చేయగా వాళ్లందరికీ ఆమె బాగా నచ్చిందని తెలుస్తోంది. హృతిక్ ఎక్స్ వైఫ్ సుస్సన్నే ఖాన్ సైతం సబాతో సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. టైం కుదిరినప్పుడల్లా హృతిక్ ఇంటికి వెళ్తోందట సబా. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే వారిద్దరూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. -
విజయ్‌తో పెళ్లి వార్తలపై తొలిసారి నోరు విప్పిన రష్మిక, ఏం చెప్పిందంటే..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండలు డేటింగ్ చేస్తున్నారంటూ కొంతకాలం రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు కారణంగా ముంబైలో వీరిద్దరూ తరచూ డిన్నర్ డేట్‌కు వెళ్లడమే. అంతేగాక ఈ న్యూయర్ వేడుకను కూడా వీరిద్దరూ ఒకేచోట జరపుకున్నారు. దీంతో రష్మిక-విజయ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇవి కాస్తా నెట్టింట జోరుగా ప్రచారం జరగడంతో ఈ వార్తలపై విజయ్ స్పందించాడు. చదవండి: మే చివర్లో డెలీవరీ, అదనపు బలం కోసం ఇలా: కాజల్ ‘ఈ చెత్త వార్తలు ఏంటీ’ అంటూ ట్విటర్ వేదిక విజయ్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక సైతం ఈ రూమర్లపై స్పందించింది. ఆమె తాజాగా నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ మూవీ మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రష్మిక మూవీ ప్రమోషన్లో భాగంగా ఇంటర్య్వూలు ఇస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో విజయ్‌తో ఆమె పెళ్లి అంటూ వస్తున్న రూమర్లపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. చదవండి: నేరుగా ఓటీటీకి రామారావు ఆన్‌డ్యూటీ!, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ఇక దీనికి రష్మిక.. ‘ఆ వార్తలు నా దృష్టికి కూడా వచ్చాయి. ఇలాంటివి రూమర్లు నాకు కొత్తకాదు. వాటిని విని నవ్వుకోవటం అలవాటైపోయింది. ప్రేమించి, పెళ్లి చేసుకునేంత సమయం నా దగ్గర లేదు’ అంటూ సమాధానం ఇచ్చింది. అయితే ఆమె సమాధానం విన్న నెటిజన్లు ఈ జంట తీరుపై తమదైన శైలి స్పందిస్తున్నారు. ‘ప్రస్తుతం మీరు ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా ఏం లేదు. అలాంటప్పుడు ముంబైలో మీ ఇద్దరికి పనేంటి. న్యూ ఇయర్‌ను కూడా కలిసే సెలబ్రేట్ చేసుకున్నారు, మీతో పాటు మరో సెలబ్రెటీలు కూడా లేరు కదా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ గురించి తొలిసారి పోస్ట్ చేసిన హృతిక్ రోషన్
Hrithik Roshan Posts First Time For Rumoured Girl Friend Saba Azad: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సబా ఆజాద్ అనే యంగ్ హీరోయిన్గా డేటింగ్లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవలే ముంబైలో వీరిద్దరూ డిన్నర్ డేట్‌కు వెళ్లిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో వీళ్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ స్టార్ట్ అయ్యిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మొన్నటికి మొన్న హృతిక్ ఫ్యామిలీతో కలిసి సబా ఆజాద్ లంచ్ చేయడం ఆ వార్తలకి మరింత బలం చేకూరినట్లయ్యింది. చదవండి: 'నా ప్రేమకథ ఎప్పటికీ ముగియదు,సమంత ఎమోషనల్ పోస్ట్ తాజాగా హృతిక్ రోషన్ తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ గురించి తొలిసారిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సబా ఆజాద్, నసీరుద్దీన్ షా కొడుకు ఇమాద్ షా కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. ‘‘కిల్ ఇట్ యూ గాయ్స్’’అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. దీనికి సబా సైతం హృతిక్‌కి థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టింది. కాగా సబా, ఇమాద్ జంటగా ఓ షోలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లకు సపోర్ట్‌గా హృతిక్ పోస్ట్ చేయడంతో వీరి డేటింగ్ రూమర్స్ మళ్లీ సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. చదవండి: రాకీ జోర్దాన్‌తో ఉన్న రిలేషన్‌పై సుప్రీత ఓపెన్ అప్ -
రూమర్స్‌పై రాజ్ తరుణ్ క్లారిటీ
ఇటీవల రాజుగాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. కొంత కాలంగా సరైన హిట్స్లేక ఇబ్బందుల్లో ఉన్న ఈ యంగ్ హీరో తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ ఓ కోలీవుడ్ సూపర్‌హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. తమిళ్ లో సూపర్ హిట్ అయిన నేనూం రౌడీదాన్ చిత్రాన్ని తెలుగులో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా రూపొందిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై రాజ్ తరుణ్ స్పందించాడు. తాను ఏ రీమేక్ సినిమా చేయటం లేదని క్లారిటీ ఇచ్చాడు రాజ్ తరుణ్. ప్రస్తుతం తను చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉందని వెల్లడించిన ఈ యంగ్ హీరో నటీనటులు, సాంకేతిక నిపుణులను ఇంకా ఫైనల్ చేయలేదని తెలిపారు. దీంతో కొద్ది రోజులు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న నానూం రౌడీదాన్ రీమేక్ వార్తలు రూమర్స్ అని తేలిపోయింది. -
మా అమ్మ బతికే ఉంది: నటి
సాక్షి, ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటి ముంతాజ్ మరణ వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె కుమార్తె, నటి కమ్ మోడల్ అయిన తన్యా మద్వాని స్పందించారు. ‘మా అమ్మ గురించి ఏవేవో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె చనిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. అది రూమర్. ఆమె బతికే ఉంది. ఆమె ఆరోగ్యవంతంగా ఉన్నారు. నాతోపాటే ఉంటూ షాపింగ్‌లు చేస్తూ.. తన పనులను ఆమె చేసుకుంటున్నారు అని తన్యా వివరణ ఇచ్చారు. ఓ వీడియో సందేశాన్ని, ముంతాజ్ ఫోటోను తన్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. 70 ఏళ్ల ముంతాజ్.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సోనె కి చిదియాతో కెరీర్‌ను ప్రారంభించారు. దో రాస్తే.. బంధన్.. మేలా, అపరాధ్, నాగిన్ తదితర చిత్రాలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఖిలోనా(1970) చిత్రంలో వేశ్య పాత్రకు ప్రశంసలతోపాటు.. ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డు దక్కింది. 1977 తర్వాత చిత్రాలకు దూరమైన ఆమె.. చివరగా 1990లో ఆందియాన్లో కనిపించారు. ప్రస్తుతం ఆమె కూతురితోపాటు ఇటలీలో ఉన్నట్లు తెలుస్తోంది. Rumor about my mother’s death ! Not true. #mumtaz #bollywood #press #actress #mumtazactress A post shared by Tanya Madhvani (@tanyamadhvani) on Apr 28, 2018 at 2:57am PDT -
ఎంసెట్ 2 పేపర్ లీకేజీ పై ఆందోళన
-
ఆ ఊళ్లో దీపం కదిలి వెళ్తుంది..!
మిరుదొడ్డి (మెదక్) : రాత్రి వేళల్లో దయ్యం వచ్చి మంటలు రేపుతోందంటూ ఆ గ్రామంలో పుకారు షికారు చేసింది. ఇటీవల బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళే దయ్యమై తిరుగుతోందన్న వదంతి వారి కంటిపై కునుకు లేకుండా చేసింది. దయ్యం భయంతో ఆ గ్రామస్తులు జాగారం చేస్తున్నారన్న సమాచారం పోలీసులకు చేరింది. వారు రంగ ప్రవేశం చేసి.. అసలు విషయం తేల్చారు. మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామం ఈ ఘటనకు వేదికైంది. గ్రామ శివారులోని రుద్రాయ కుంట సమీపంలో మూడు రోజులుగా రాత్రి వేళ మంటలు మండుతున్నట్లు, దీపం కదిలి వెళ్తున్నట్లు కొందరు పుకార్లు పుట్టించారు. గ్రామానికి చెందిన ఓ మహిళ ఇటీవల బావిలో దూకి చనిపోయింది. ఆమె దయ్యమై తిరుగుతూ మంటలు రేపుతూ, దీపాలు వెలిగిస్తూ తిరుగుతోందని గ్రామస్తులు మూఢంగా నమ్మారు. దీంతో మూడు రోజులుగా రాత్రయిందంటే నిద్రపోవటం మానేశారు. భయంతో గుంపులు గుంపులుగా ఉంటూ కాలం గడుపుతున్నారు. అంతా ఒట్టిదే... ఈ విషయం తెలుసుకున్న మిరుదొడ్డి ఏఎస్ఐ సామయ్య ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు.దయ్యం లేదు గియ్యం లేదు ఎవరి ఇళ్లలో వారు ప్రశాంతంగా పడుకోవాలని గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు వినలేదు. దీపం వెలుగులు మీరు కూడా చూడాల్సిందేనని పట్టుబట్టారు. ఇక చేసేది లేక పోలీసులు అర్థరాత్రి వరకు నిరీక్షించారు. కొద్ది సేపటికి గ్రామస్తులు చెప్పిన మాదిరిగానే కుంట సమీపంలో ఓ దీపం వెలుగు మిణుకు మిణుకు మంటూ వెళ్లటం కనిపించింది. దీంతో పోలీసులు కొందరు గ్రామస్తులను వెంట బెట్టుకుని వెలుతురు వస్తున్న చోటికి వెళ్లి పరిశీలించారు. అక్కడ చీకట్లో ఏమీ కనిపించకపోవడంతో వెనుదిరిగి పరిస్థితిని సమీక్షించారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగుపల్లి- మల్లుపల్లి రోడ్డులో రాత్రిపూట వెళ్లే వాహనాల లైటు వెలుతురుని చూసి దయ్యం పుకారు లేపారని గ్రామస్తులకు పోలీసులు నచ్చజెప్పారు. కొందరు గ్రామస్తులను తమ జీపులో ఎక్కించుకుని లింగుపల్లి-మల్లుపల్లి రోడ్డున తిప్పారు. ఆ వాహనం లైట్లు రెడ్, బ్లూ లైట్లు రంగుల్లో మిణుకు మిణుకు మంటూ వెలుగుతుండటంతో చూసిన గ్రామస్తుల అనుమానం పటాపంచలైంది. మూడు రోజులుగా వాహనాల లైట్లను చూసి దయ్యంగా భ్రమించి అనవసరంగా నిద్రాహారాలు మాని భయపడాల్సి వచ్చిందని గ్రామస్తులు ఒక్క సారిగా నవ్వుకున్నారు. దయ్యం వదంతులు ఒట్టివేనని తేలటంతో గ్రామస్తులు ధైర్యంగా ఇళ్లకు వెళ్లిపోయారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా చర్యలు తప్పవని ఏఎస్ఐ సామయ్య హెచ్చరించారు. దయ్యం పుకారు లేపి గ్రామంలో లేనిపోని సమస్యలు సృష్టించడం సరికాదన్నారు. మూఢనమ్మకాలను వదిలిపెట్టి అసలు నిజా నిజాలేమిటో గ్రహించాలని గ్రామస్తులకు హితవు పలికారు. -
ట్విట్టర్, ఫేస్ బుక్ లో వదంతులకు మరణశిక్షే..!
ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తే ఏమవుతుందో తెలుసా.. ఇక్కడైతే ఏమో గానీ సౌదీ అరేబియాలో అయితే మాత్రం మరణశిక్ష విధిస్తారట. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వ వెబ్సైట్లో అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలపై ఎన్నో ఆంక్షలు విధిస్తున్న సౌదీ సర్కారు తాజా ప్రకటన సామాన్య ప్రజల్లో ఆందోళన రేపుతోంది. ఈ ప్రకటన వెనుక.. మొత్తం సోషల్ మీడియానే ఆ దేశంలో నిషేధించాలన్న ప్రయత్నం కనిపిస్తోందని పలువురు అంటున్నారు. కొత్తరాజు సల్మాన్ పాలనలో ఈ మరణ శిక్షల జోరు పెరిగిపోతోంది. సౌదీ రాజు కొత్త నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంస్థలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల హజ్ యాత్రకు వెళ్లి తొక్కిసలాటలో వెయ్యిమంది వరకూ చనిపోవడం... దీనికి కారణం ప్రభుత్వ నిర్వహణ లోపమేనని సోషల్ మీడియాలో రావడంతో... ఆగ్రహానికి గురైన ప్రభత్వం ఈ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు చిన్నపాటి తప్పులు చేసినవారికి.. ఖైదు, ప్రయాణ నిషేధం, గృహ నిర్బంధం వంటి శిక్షలు అమలులో ఉన్నాయని, ఇప్పుడు ఓ సామాజిక మాధ్యమంలో వదంతులు సృష్టించేవారికి మరణ శిక్ష విధించేందుకు నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి అని మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ చెప్తోంది. అయితే ఏ రకం వార్తలకు శిక్ష పడుతుందో స్పష్టంగా ధ్రువీకరించలేదని ఓ సీనియర్ న్యాయమూర్తి అంటున్నారు. ఇప్పుడు అందరిలో ఆందోళన కలిగిస్తున్న కొత్త చట్టాన్ని కొన్ని వారాల క్రితం వచ్చిన సౌదీ రాజు ప్రకటించారు. 79 ఏళ్లు కొత్త రాజు సల్మాన్, అతడి కుమారుడు 30 ఏళ్ల మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రవేశ పెట్టిన ఈ ప్రకటనకు జనం నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. మాస్ మీడియాను సెన్సార్ చేయడం కోసం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. -
ఇంటిపోరు..
-
రెంటికీ చెడ్డ రేవడి
-
యూ... సిల్లీ !
-
పాత్ర... బరువైంది
-
రాజోలు రభస
-
రాజకీయాల్లోకి కొత్త నీరు
-
జనం నమ్మడం లేదు
-
వల సల సల సల...
-
పొత్తుల మారి ఎత్తులు
-
వినోదన్నా గిట్లయిందేందే?
-
చెవిలో పువ్వెట్టింగా ?
-
తెలంగాణా గడ్డపై టీడీపీకి గడ్డు కాలం
-
పార్టీకే ఎసరు పెడుతున్న 'చంద్రబాబు ఆత్మ'
-
ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీ అవుతున్న టీడీపి
-
సైకిలెక్కుతారా ?
-
కోమటిరెడ్డి షో
-
పచ్చగడ్డి వేస్తే భగ్గే
-
కేసీరియస్
-
కిల్లీ .. ఢిల్లీ ..!
-
సికింద్రాబాద్‌లో చిన్నమ్మ
-
నవ్వాలా ? ఏడ్వాలా ?
-
ఒక్క ఛాన్సివ్వండి ప్లీజ్
-
దేశం...దివాళా
-
తుమ్మలకు నామాలు
-
27న బ్రేక్ చేస్తా
-
హోం ఫట్
-
తుమ్మలకు నామాలు
-
64 మందిని బలిగొన్న వదంతి
భోపాల్: నదిపై ఉన్న వంతెన కూలిపోతుందన్న వదంతి 64 మందిని బలితీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లా రతన్‌గఢ్ దుర్గామాత దేవాలయం సమీపంలో ఆదివారం జరిగిన తొక్కిసలాటకు వంతెన కూలిపోతుందన్న వదంతి కారణమని చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందిపైగా గాయపడ్డారు. దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సింధ్ నదిపై ఉన్న ఇరుకైన బ్రిడ్జి దాటుతుండగా ఒక్కసారిగా తొక్కిసలాట ప్రారంభమైంది. వంతెన కూలిపోతుందన్న వదంది రేగంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఎవరికివారు ప్రాణభయంతో పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. పలువురు కాళ్ల కింద నలిగిపోయి మృతిచెందగా, కొందరు నదిలో పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే పోలీసు లాఠీచార్జి కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని వచ్చిన ఆరోపణలను దతియా ఎమ్మెల్యే నరోత్తమ్ మిశ్రా తోసిపుచ్చారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.