Actress Keerthy Suresh Love And Marriage Rumours With Businessman Goes Viral - Sakshi
Sakshi News home page

Keerthy Suresh: వ్యాపారవేత్తతో కీర్తి సురేశ్ లవ్.. పెళ్లి అప్పుడేనా?

Published Wed, Jan 25 2023 6:27 PM | Last Updated on Wed, Jan 25 2023 8:13 PM

Keerthy Suresh Love Rumours With A Business Man In Social Media - Sakshi

టాలీవుడ్‌తో పాటు తమిళంలో ఫేమ్‌ సంపాదించిన నటి కీర్తి సురేశ్. దక్షిణాదిలో అగ్ర హీరోయిన్లలో ఆమె ఒకరు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మపై సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరలవుతున్నాయి. కీర్తి సురేశ్‌ పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఆమె చిన్ననాటి స్నేహితుడితో ప్రేమలో ఉందని గాసిప్స్ గుప్పమంటున్నాయి. దాదాపు 13 ఏళ్ల నుంచి వీరిద్దరూ సీక్రెట్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. అతను ఓ వ్యాపారవేత్త అని.. కేరళలో రిసార్టులు కూడా‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భామ ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని సమాచారం. మరో నాలుగేళ్ల తర్వాతే వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

కీర్తి సురేశ్‌ పెళ్లిపై గతంలోనూ ఇలాంటి ప్రచారం పెద్దఎత్తున జరిగింది. కోలీవుడ్‌కు చెందిన స్టార్‌ మ్యూజిక్‌ కంపోజర్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే.. అవన్నీ తప్పుడు ప్రచారమని ఆమె కుటుంబసభ్యులు తోసిపుచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికే ఆమెకు ఓ వ్యాపారవేత్తతో పెళ్లి కుదిరినట్లు వార్తలొచ్చాయి. 

అయితే మరోసారి కీర్తి సురేశ్ ప్రేమ వార్తలు రావడంతో.. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.  అయితే ఈ ఇలాంటి వార్తలపై నటి ఇంతవరకు స్పందించలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కీర్తి సురేశ్‌.. నానితో కలిసి ‘దసరా’, మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్‌లో కనిపంచనున్నారు. వీటితోపాటు పలు తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement