నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండలు డేటింగ్ చేస్తున్నారంటూ కొంతకాలం రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు కారణంగా ముంబైలో వీరిద్దరూ తరచూ డిన్నర్ డేట్‌కు వెళ్లడమే. అంతేగాక ఈ న్యూయర్ వేడుకను కూడా వీరిద్దరూ ఒకేచోట జరపుకున్నారు. దీంతో రష్మిక-విజయ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇవి కాస్తా నెట్టింట జోరుగా ప్రచారం జరగడంతో ఈ వార్తలపై విజయ్ స్పందించాడు.
చదవండి: మే చివర్లో డెలీవరీ, అదనపు బలం కోసం ఇలా: కాజల్
‘ఈ చెత్త వార్తలు ఏంటీ’ అంటూ ట్విటర్ వేదిక విజయ్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక సైతం ఈ రూమర్లపై స్పందించింది. ఆమె తాజాగా నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ మూవీ మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రష్మిక మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్య్వూలు ఇస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో విజయ్‌తో ఆమె పెళ్లి అంటూ వస్తున్న రూమర్లపై ఆమెకు ప్రశ్న ఎదురైంది.
చదవండి: నేరుగా ఓటీటీకి రామారావు ఆన్‌డ్యూటీ!, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఇక దీనికి రష్మిక.. ‘ఆ వార్తలు నా దృష్టికి కూడా వచ్చాయి. ఇలాంటివి రూమర్లు నాకు కొత్తకాదు. వాటిని విని నవ్వుకోవటం అలవాటైపోయింది. ప్రేమించి, పెళ్లి చేసుకునేంత సమయం నా దగ్గర లేదు’ అంటూ సమాధానం ఇచ్చింది. అయితే ఆమె సమాధానం విన్న నెటిజన్లు ఈ జంట తీరుపై తమదైన శైలి స్పందిస్తున్నారు. ‘ప్రస్తుతం మీరు ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా ఏం లేదు. అలాంటప్పుడు ముంబైలో మీ ఇద్దరికి పనేంటి. న్యూ ఇయర్‌ను కూడా కలిసే సెలబ్రేట్ చేసుకున్నారు, మీతో పాటు మరో సెలబ్రెటీలు కూడా లేరు కదా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment