Hrithik Roshan Interesting Post On His Rumoured Girl Friend Saba Azad Goes Viral - Sakshi
Sakshi News home page

Hrithik Roshan: రూమర్డ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ గురించి హృతిక్‌ ఏమన్నాడంటే..

Published Sat, Feb 26 2022 3:51 PM | Last Updated on Sat, Feb 26 2022 6:27 PM

​​‍Hrithik Roshan Posts First Time For Rumoured Girl Friend Saba Azad - Sakshi

Hrithik Roshan Posts First Time For Rumoured Girl Friend Saba Azad: బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ సబా ఆజాద్‌ అనే యంగ్‌ హీరోయిన్‌గా డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఇటీవలే ముంబైలో వీరిద్దరూ డిన్నర్‌ డేట్‌కు వెళ్లిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో వీళ్ల మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ స్టార్ట్‌ అయ్యిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మొన్నటికి మొన్న హృతిక్‌ ఫ్యామిలీతో కలిసి సబా ఆజాద్‌ లంచ్‌ చేయడం ఆ వార్తలకి మరింత బలం చేకూరినట్లయ్యింది. చదవండి: 'నా ప్రేమకథ ఎప్పటికీ ముగియదు,సమంత ఎమోషనల్‌ పోస్ట్‌

తాజాగా హృతిక్‌ రోషన్‌ తన రూమర్డ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ గురించి తొలిసారిగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. సబా ఆజాద్, నసీరుద్దీన్ షా కొడుకు ఇమాద్ షా కలిసి ఉన్న ఫోటోలను షేర్‌ చేస్తూ.. ‘‘కిల్ ఇట్ యూ గాయ్స్’’అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. దీనికి సబా సైతం హృతిక్‌కి థ్యాంక్స్‌ చెబుతూ పోస్ట్‌ పెట్టింది. కాగా సబా, ఇమాద్‌ జంటగా ఓ షోలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లకు సపోర్ట్‌గా హృతిక్‌ పోస్ట్‌ చేయడంతో వీరి డేటింగ్‌ రూమర్స్‌ మళ్లీ సోషల్‌ మీడియాలో ఊపందుకున్నాయి. చదవండి: రాకీ జోర్దాన్‌తో ఉన్న రిలేషన్‌పై సుప్రీత ఓపెన్‌ అప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement