girl fried
-
ఐపీఏల్ లో అట్టర్ ఫ్లాప్.. పార్టీలకు మాత్రం ఫుల్ ఫామ్ నువ్వు మాములోడివి కాదు సామీ...
-
రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ గురించి తొలిసారి పోస్ట్ చేసిన హృతిక్ రోషన్
Hrithik Roshan Posts First Time For Rumoured Girl Friend Saba Azad: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సబా ఆజాద్ అనే యంగ్ హీరోయిన్గా డేటింగ్లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవలే ముంబైలో వీరిద్దరూ డిన్నర్ డేట్‌కు వెళ్లిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో వీళ్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ స్టార్ట్ అయ్యిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మొన్నటికి మొన్న హృతిక్ ఫ్యామిలీతో కలిసి సబా ఆజాద్ లంచ్ చేయడం ఆ వార్తలకి మరింత బలం చేకూరినట్లయ్యింది. చదవండి: 'నా ప్రేమకథ ఎప్పటికీ ముగియదు,సమంత ఎమోషనల్ పోస్ట్ తాజాగా హృతిక్ రోషన్ తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ గురించి తొలిసారిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సబా ఆజాద్, నసీరుద్దీన్ షా కొడుకు ఇమాద్ షా కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. ‘‘కిల్ ఇట్ యూ గాయ్స్’’అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. దీనికి సబా సైతం హృతిక్‌కి థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టింది. కాగా సబా, ఇమాద్ జంటగా ఓ షోలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లకు సపోర్ట్‌గా హృతిక్ పోస్ట్ చేయడంతో వీరి డేటింగ్ రూమర్స్ మళ్లీ సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. చదవండి: రాకీ జోర్దాన్‌తో ఉన్న రిలేషన్‌పై సుప్రీత ఓపెన్ అప్ -
సోదరి పక్కన ప్రియుడ్ని చూసి...
ముంబై : తమ సోదరిని ప్రేమించినందుకు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు ముంబైకి చెందిన ఓ ఇద్దరు సోదరులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబైలొని మలాడ్ ప్రాంతానికి చెందిన సైఫ్ అలీ షరాఫత్ అలీ(25) అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. తమ ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి సోదరులు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా ఇంట్లో ఎవరూలేరని యువతి చెప్పడంతో అలీ మంగళవారం మధ్యాహ్నం ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. వాలిద్దరు ఇంట్లో ముచ్చటిస్తుండగా యువతి సోదరులు వసీం బద్రుద్దిన్ ఖాన్(19), అజ్మల్(23) అక్కడికి వచ్చారు. తమ సోదరి పక్కన కూర్చొని ఉన్న అలీని చూసి కోపంతో అతడిపై దాడికి దిగారు. మా చెల్లిని ప్రేమిస్తావా..నీకెంత ధైర్యమంటూ..కత్తితో అతడిని పొడిచేశారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న అలీని అక్కడే వదిలేని ఇద్దరు సోదరులు పారిపోయారు. స్థానికుల సాయంతో ఆ యువతి అలీని ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే అలీ మృతి చెందారని తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. పరారైన యువతి ఇద్దరు సోదరులను పట్టుకున్నామని, మరిన్ని వివరాల కోసం విచారణ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. -
ప్రేయసిని గోదావరిలోకి తోసేసిన ప్రియుడు
కాకినాడ : వారు ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. మన ప్రేమకథకు పెళ్లితో సుఖాంతం పలుకుదాం అని అడిగినందుకు ప్రేయసిని గౌతమీ గోదావరి నదిలోకి తోసేశాడు ఆ ప్రేమికుడు. ఈ ఘటన పాండిచ్చేరి పరిధిలోని యానాంలో చోటుచేసుకుంది. స్థానికులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన గండి అలివేణి(26) రాజమండ్రి గ్యాస్ అధారిటీ ఆప్ ఇండియా(గెయిల్)లో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస్తోంది. ఎస్.యానంకు చెందిన శ్రీనివాసరావు రాజమండ్రిలోని బట్టలషాపులో పనిచేసేవాడు. ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. గత కొంతకాలంగా పెళ్లిచేసుకోమని అలివేణి శ్రీనివాస్‌ను కోరుతోంది. ఈ క్రమంలో శ్రీనివాస్ ఆదివారం రాత్రి యానాం వెళ్లాడు. వారు యానాం-ఎదుర్లంక జీఎంసీ బాలయోగి వారధిపై కొద్దిసేపు గడిపారు. సోమవారం వేకువజామున పెళ్లి విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ప్రియుడు ఆమె తలపై మోది, గొంతు నులిమి వంతెనపై నుంచి గౌతమీ గోదావరి నదిలోకి తోసేశాడు. అనంతరం ఆమె సెల్‌ఫోన్, హ్యాండ్‌బ్యాగ్ తీసుకుని పరారయ్యాడు. గమనించిన స్థానిక మత్స్యకారులు అలివేణిని రక్షించి యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఐ.పోలవరం ఎస్సై వి.శివకుమార్ ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.