Is Hrithik Roshan And Saba Azad Getting Married Soon: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సబా ఆజాద్ అనే యంగ్ హీరోయిన్‌గా డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవలే ముంబైలో వీరిద్దరూ డిన్నర్ డేట్‌కు వెళ్లిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో వీళ్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ స్టార్ట్ అయ్యిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మొన్నటికి మొన్న హృతిక్ ఫ్యామిలీతో కలిసి సబా ఆజాద్ లంచ్ చేయడం ఆ వార్తలకి మరింత బలం చేకూరినట్లయ్యింది. అయితే తాజాగా మరో వార్త బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఈ అందగాడు మరోసారి పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
2014లో పరస్పర అంగీకారంతో సుస్సన్నే ఖాన్ నుంచి విడాకులు తీసుకున్నాడు హృతిక్ రోషన్. తర్వాత బీటౌన్ బ్యూటీ సబా ఆజాద్‌తో హృతిక్‌కు పరిచయం ఏర్పడింది. వరిద్దరూ గత కొంతకాలంగా సన్నిహింతగా ఉన్నట్లు తెలిపే ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులు, పిల్లలకు సబాను పరిచయం చేయగా వాళ్లందరికీ ఆమె బాగా నచ్చిందని తెలుస్తోంది. హృతిక్ ఎక్స్ వైఫ్ సుస్సన్నే ఖాన్ సైతం సబాతో సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. టైం కుదిరినప్పుడల్లా హృతిక్ ఇంటికి వెళ్తోందట సబా. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే వారిద్దరూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment