Producer Anil Sunkara Gives Clarity On Akhil Akkineni Agent Movie Stop Rumours - Sakshi
Sakshi News home page

Anil Sunkara On Agent Movie: అఖిల్‌ 'ఏజెంట్‌' మూవీ ఆగిపోయిందా? నిర్మాత ఏమన్నారంటే..

Published Tue, May 17 2022 4:07 PM | Last Updated on Tue, May 17 2022 6:35 PM

Akhil Akkineni Agent Movie Producer Anil Sunkara Clarity On Rumours - Sakshi

అక్కినేని అఖిల్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఏజెంట్‌'. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ వంటి హిట్టు మూవీ తర్వాత అఖిల్‌ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: చై-సామ్‌ విడాకుల తర్వాత.. ఫస్ట్‌ గ్రూప్‌ ఫోటో ఇదే!

నిర్మాత అనిల్‌ సుంకరతో ఏర్పడిన అభిప్రాయ బేధాల వల్ల డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారని, దీంతో సినిమా ఆగిపోయిందంటూ కూడా నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.తాజాగా ఈ వార్తలపై నిర్మాత అనిల్‌ సుంకర సోషల్‌ మీడియా వేదికగా  క్లారిటీ ఇచ్చారు.

'ఏజెంట్‌ సినిమా కొత్త షెడ్యూల్‌ త్వరలోనే మనాలీలో ప్రారంభమవుతుంది. త్వరలోనే టీజర్‌ అప్‌డేట్‌ ఇస్తాం. దయచేసి అఫీషియల్‌ ట్వీట్స్‌ మాత్రమే ఫాలో అవ్వండి. రూమర్స్‌ గురించి పట్టించుకోవద్దు' అంటూ స్పష్టతనిచ్చారు. దీంతో సోషల్‌ మీడియాలో వస్తున్న రూమర్స్‌కి చెక్‌ పెట్టినట్లయ్యింది. చదవండి: 'షూటింగ్‌ ఆపేశారు.. నన్ను వాష్‌రూంలో పెట్టి బంధించారు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement