జూలై 31న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: శరత్‌బాబు (నటుడు); ముంతాజ్ (నటి)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యునికి సంబంధించినది. మీ పుట్టిన తేదీ 31. (3+1=4). ఇది రాహువుకి సంబంధించిన సంఖ్య. రాహు, సూర్యుల కలయిక వల్ల ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక మైలురాయి వంటిదని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అవివాహితులకు వివాహ యోగం, పిల్లలకు ఉద్యోగ, వివాహ ప్రాప్తి జరుగుతుంది. ట్రాన్స్‌ఫర్లకోసం ఎదురు చూసేవారికి కోరుకున్న చోటికి ట్రాన్స్‌ఫరవుతుంది. కొత్త వ్యాపారాలు విస్తరించడానికి ఇది అనుకూల సమయం.
సంవత్సరం తలపెట్టిన ఏ కార్యమైనా మీకు జీవితంలో మంచి ఆదాయాన్నిస్తుంది. స్నేహితులతో, అధికారులతో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, సత్సంబంధాలు ఏర్పడతాయి. విదేశీవిద్య, ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న గ్రీన్‌కార్డ్ ఈ సంవత్సరం కచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. లక్కీ నంబర్స్: 1,4,5,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డ్, రోజ్, ఆరంజ్, బ్రౌన్; లక్కీడేస్: ఆది, సోమ, బుధ, శుక్రవారాలు; లక్కీ మంత్స్: జనవరి, ఏప్రిల్, జులై, సెప్టెంబర్; సూచనలు: హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల మెడికల్ చెకప్ చేయించుకోవడం మంచిది. రాహుజపం చేయించడం, వికలాంగులను, అంధులను ఆదుకోవడం, కోతులకు అరటిపండ్లు పెట్టడం, తండ్రి తరఫు వారిని ఆదరించడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్