‘గురు’తో నేను కొత్త నటుణ్ణి | Venky's 'Guru' trailer released | Sakshi
Sakshi News home page

‘గురు’తో నేను కొత్త నటుణ్ణి

Published Mon, Mar 20 2017 11:39 PM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

‘గురు’తో నేను కొత్త నటుణ్ణి

‘గురు’తో నేను కొత్త నటుణ్ణి

‘‘30 ఏళ్లుగా నటిస్తున్నా, ఎన్నో చిత్రాలు చేశా. అవార్డులు అందుకున్నా. అయితే, ఎప్పుడూ పూర్తి కథను చదవలేదు. కానీ, ‘గురు’ కథను పూర్తిగా చదవమని సుధ చెప్పారు. సరేనని చదవడం మొదలుపెడితే... నాలో ఏదో తెలియని శక్తి వచ్చింది. ఈ సినిమాతో నేను ఓ కొత్త నటుణ్ణి అనిపించింది’’ అని వెంకటేశ్‌ అన్నారు. వెంకటేశ్‌ హీరోగా సుధ కొంకర దర్శకత్వంలో ఎస్‌. శశికాంత్‌ నిర్మించిన సినిమా ‘గురు’. రితికా సింగ్, ముంతాజ్, నాజర్‌ ముఖ్యతారలు. సోమవారం ట్రైలర్‌ విడుదల చేశారు.

వెంకటేశ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ కథ విన్నప్పుడు డెంగీ జ్వరం రావడంతో చేయలేకపోయా. తమిళం, హిందీ భాషల్లో సినిమా తీసిన తర్వాత నాకు కుదిరింది. గత చిత్రాలకంటే ఇందులో బాగా లీనమై నటించా. నా డైలాగ్‌ డెలీవరీ, బాడీ లాంగ్వేజ్‌ కొత్తగా ఉంటాయి. ఈ సినిమాలో మాత్రమే నేను గురు. షూటింగ్‌లో మాత్రం నా గురు సుధానే. తనకి నేను స్టూడెంట్‌ అయిపోయా. ఈ సినిమాలో ఓ ట్యూన్‌ వినగానే చాలా ఎగ్జయిట్‌గా అనిపించి పాట పాడా. సంతోశ్‌ మంచి పాటలిచ్చారు’’ అన్నారు.

సుధ కొంగర మాట్లాడుతూ– ‘‘గురు’ కథ అనుకున్నప్పుడు ఫస్ట్‌ మణిరత్నంగారిని సంప్రదించా. నాలుగైదేళ్లు బాక్సింగ్‌పై పరిశోధన చేసి, 250 మంది బాక్సర్లను కలిసి కథ రెడీ చేశా. వెంకీగారిని కలిసి బాక్సింగ్‌ నేపథ్యం అనగానే చాలా ఎక్జైట్ అయ్యారు. ఆయన కమిట్‌మెంట్, సిన్సియారిటీ నాకు నచ్చింది. ఆయన టైమ్‌ అంటే టైమే. ఆయనతో పనిచేయడం చాలా ఎగ్జయిటింగ్‌ ఉంది. బాక్సర్‌ రితిక 2010 నుంచి నాతో ట్రావెల్‌ అవుతోంది. ముంతాజ్‌ కూడా బాక్సర్‌.. ఇద్దరూ సిస్టర్స్‌గా యాక్ట్‌ చేశారు. నిర్మాత శశికాంత్‌ చాలా ఫ్రీడమ్‌ ఇవ్వడంతో క్వాలిటీ సినిమా వచ్చింది’’ అన్నారు. ‘‘వెంకీ సార్‌ని చూస్తే నా రియల్‌ గురు గుర్తుకొచ్చారు. ఈ చిత్రం చూశాక చాలా మంది స్ఫూర్తి పొందుతారు’’ అన్నారు రితికా సింగ్‌. శశికాంత్, ముంతాజ్, సంగీత దర్శకుడు సంతోశ్‌ నారాయణన్, పాటల రచయిత భాస్కర భట్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రాడ్యూసర్‌ రామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement