Nasser
-
హీరో మహేశ్ బాబుకి యాక్టింగ్ క్లాసులు.. కొత్తగా ఆ విషయాల్లో?
సూపర్ స్టార్ మహేశ్ బాబుకి యాక్టింగ్ మళ్లీ కొత్తగా యాక్టింగ్ క్లాసులా? ఎందుకు ఏమైందని అనుకుంటున్నారా? ఈ మధ్య వెకేషన్ ముగించుకుని ఇంటికొచ్చేసిన మహేశ్.. ప్రస్తుతం రాజమౌళి మూవీకి జరుగుతున్న ప్రీ ప్రొడక్షన్లో బిజీ అయిపోయాడు. ఈ క్రమంలోనే మహేశ్ కొత్తగా కొన్ని విషయాల్లో మారేందుకు రెడీ అయిపోతున్నాడనే న్యూస్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సుధీర్ బాబు యాక్షన్ మూవీ... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేశ్... రాజమౌళితో కలిసి ఇప్పుడు పనిచేయబోతున్నాడు. స్క్రిప్ట్ లాక్ అయిపోయింది. దీంతో ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్, ఇతరత్రా వర్క్ అంతా జరుగుతోంది. ఇందులో భాగంగానే మూవీలో మహేశ్ బాబు పాత్ర యాస, యాక్టింగ్ విషయంలో నాజర్ మెలకువలు నేర్పిస్తున్నారట. అంటే రాజమౌళి ప్రాజెక్ట్ కోసం సరికొత్త మహేశ్‌ని చూడబోతున్నమాట.ఇదిలా ఉండగా త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి SSMB 29 గురించి రాజమౌళి చెప్పబోతున్నారు. గతంలో ఓసారి మాట్లాడుతూ 'గ్లోబ్‌ట్రాటింగ్' స్టోరీగా ఉండబోతుందని చెప్పారు. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఇంటర్నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న రాజమౌళి.. మహేశ్‌తో ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియాలంటే మరికొన్నేళ్లు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: 'హనుమాన్' దర్శకుడికి చేదు అనుభవం.. ఏం జరిగిందంటే?) -
రేపు నడిగర్ సంఘ కార్యవర్గం అత్యవసర సమావేశం
పెరంబూరు: మంగళవారం ఉదయం దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యవర్గ అత్యవసర సమావేశం జరగనుంది. 2015లో జరిగిన ఈ సంఘం ఎన్నికల్లో నాజర్ జట్టు విజయం సాధించింది. విశాల్ కార్యదర్శిగా, నటుడు కార్తీ కోశాధికారిగా కార్యవర్గం బాధ్యతలను చేపట్టారు. మూడేళ్లకోసారి జరిగే ఈ సంఘ కార్యవర్గానికి గత ఏడాదిలోనే కాలపరిమితి ముగిసింది. అయితే సంఘ నూతన భవన నిర్మాణం పూర్తయ్యే దశలో ఉండడంతో ఎన్నికలను వాయిదా వేశారు. నడిగర్‌సంఘం ఎన్నికలు జూన్‌లో జరగనున్న పరిస్థితుల్లో మరోసారి నాజర్ జట్టు బరిలోకి దిగుతోంది. ఈ జట్టుకు వ్యతిరేకంగా నటి రాధిక జట్టు బరిలో ఢీకొనడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో కార్యవర్గం మంగళవారం స్థానిక టీ.నగర్‌లోని ఒక నక్షత్ర హోటల్లో అత్యవసరంగా సమావేశం కానుంది. -
సెట్లో చెత్త ఎత్తిన సీనియర్ యాక్టర్
సినిమాల్లో తెరపై నీతులు చెప్పే స్టార్లు.. రియల్ లైఫ్‌లో అది పాటించటం చాలా అరుదు. అయితే విలక్షణ నటుడు నాజర్ మాత్రం అలా కాదు. స్వయంగా తానే సెట్లో చెత్త ఎత్తి చూపించారు. పంచె ఎగ్గట్టి స్పాట్లో టీ కప్పులు, చెత్త కవర్లను ఏరి డస్ట్ బిన్లో పడేశారు. చుట్టుపక్కల ఉన్నవాళ్లు అది పట్టించుకోకపోయినా.. ఓ వ్యక్తి మాత్రం ఆ ఘటనను తన మొబైల్లో షూట్ చేశారు. బ్యాక్ గ్రౌండ్లో ఓ వ్యక్తి తెలుగు మాట్లాడటం గమనించొచ్చు. ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? వీడియో పాతదా? కొత్తదా? స్పష్టతలేదుగానీ ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. సీనియర్ నటుడు, పైగా నడిగర్ సంఘం ప్రెసిడెంట్ స్థాయిలో ఉండి కూడా ఆయన అలా చేయటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ ఉద్యమ సింహం లో నాజర్ లీడ్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కల్వకుంట్ల నాగేశ్వర్రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లూరి కృష్ణంరాజు దర్శకుడు. -
కేసీఆర్ బయోపిక్.. ‘ఉద్యమ సింహం’
ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే సావ్రితి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి ఘనవిజయం సాధించగా ఇటీవల మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర సినిమా ప్రారంభమైంది. తాజాగా మరో రాజకీయ నాయకుడి జీవిత కథ వెండితెరకెక్కేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బయోపిక్ ఈ రోజే (గురువారం) ప్రారంభమైంది. ఈ సినిమాలో కేసీఆర్ పాత్రలో సీనియర్ నటుడు నాజర్ నటిస్తున్నారు. కల్వకుంట్ల నాగేశ్వర్రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లూరి కృష్ణంరాజు దర్శకుడు. ‘ఉద్యమ సింహం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను కేసీఆర్ తెలంగాణ సాధన కోసం దీక్షను ప్రారంభించిన నవంబర్ 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇతర నటీనటులు వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
ఆదివాసీల పోరాటం
‘‘వర్షం పడ్డప్పుడు పాత నీరు వెళ్లిపోయి కొత్త నీరు వస్తుంటుంది. అదే విధంగా చిత్రపరిశ్రమలోకి కొత్త నటులు, సాంకేతిక నిపుణులు రావాలి. ‘నా తొలి చిత్రం ‘సింహరాశి’లో బాలనటుడిగా చేశాడు మహేంద్రన్. ‘పోరాటం’ సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. వీళ్ల ప్రయత్నం సక్సెస్ అవ్వాలి’’ అని దర్శకుడు సముద్ర అన్నారు. మహేంద్రన్, కిన్నీ వినోద్, తనూశెట్టి, ఐశ్వర్య, నాజర్ ప్రధాన పాత్రల్లో ఎం. ప్రతాప్ మురళి దర్శకత్వంలో శ్రీనివాస్‌రావు నిర్మిస్తోన్న చిత్రం ‘పోరాటం’. హరీష్–సతీష్ స్వరపరచిన ఈ చిత్రం పాటలు, ట్రైలర్‌ను తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ రిలీజ్ చేశారు. ‘‘ఓ సినిమాను ఒక్క భాషలో తీసినా, మూడు భాషల్లో తీసినా ఖర్చు విషయంలో పెద్ద తేడా ఉండదు. మూడు భాషల్లో తీస్తే మంచి బిజినెస్ ఉంటుంది. చిన్న సినిమాకి పబ్లిసిటీ అవసరం. అప్పుడే థియేటర్లు దొరుకుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ‘పోరాటం’ ఈ సినిమాకు అవసరమైన థియేటర్లు సమకూర్చేందుకు నా వంతు సహకారం అందిస్తా’’ అన్నారు ప్రతాని రామకృష్ణగౌడ్. ‘‘తమిళనాడులో జరిగిన వాస్తవ సంఘటన నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. రాజకీయ నాయకులు, పోలీసుల వల్ల తమకు జరుగుతున్న అన్యాయంపై ఆదివాసీల పోరాటమే ఈ సినిమా’’ అన్నారు. -
‘గురు’తో నేను కొత్త నటుణ్ణి
‘‘30 ఏళ్లుగా నటిస్తున్నా, ఎన్నో చిత్రాలు చేశా. అవార్డులు అందుకున్నా. అయితే, ఎప్పుడూ పూర్తి కథను చదవలేదు. కానీ, ‘గురు’ కథను పూర్తిగా చదవమని సుధ చెప్పారు. సరేనని చదవడం మొదలుపెడితే... నాలో ఏదో తెలియని శక్తి వచ్చింది. ఈ సినిమాతో నేను ఓ కొత్త నటుణ్ణి అనిపించింది’’ అని వెంకటేశ్ అన్నారు. వెంకటేశ్ హీరోగా సుధ కొంకర దర్శకత్వంలో ఎస్. శశికాంత్ నిర్మించిన సినిమా ‘గురు’. రితికా సింగ్, ముంతాజ్, నాజర్ ముఖ్యతారలు. సోమవారం ట్రైలర్ విడుదల చేశారు. వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘ఈ కథ విన్నప్పుడు డెంగీ జ్వరం రావడంతో చేయలేకపోయా. తమిళం, హిందీ భాషల్లో సినిమా తీసిన తర్వాత నాకు కుదిరింది. గత చిత్రాలకంటే ఇందులో బాగా లీనమై నటించా. నా డైలాగ్ డెలీవరీ, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటాయి. ఈ సినిమాలో మాత్రమే నేను గురు. షూటింగ్లో మాత్రం నా గురు సుధానే. తనకి నేను స్టూడెంట్ అయిపోయా. ఈ సినిమాలో ఓ ట్యూన్ వినగానే చాలా ఎగ్జయిట్‌గా అనిపించి పాట పాడా. సంతోశ్ మంచి పాటలిచ్చారు’’ అన్నారు. సుధ కొంగర మాట్లాడుతూ– ‘‘గురు’ కథ అనుకున్నప్పుడు ఫస్ట్ మణిరత్నంగారిని సంప్రదించా. నాలుగైదేళ్లు బాక్సింగ్‌పై పరిశోధన చేసి, 250 మంది బాక్సర్లను కలిసి కథ రెడీ చేశా. వెంకీగారిని కలిసి బాక్సింగ్ నేపథ్యం అనగానే చాలా ఎక్జైట్ అయ్యారు. ఆయన కమిట్మెంట్, సిన్సియారిటీ నాకు నచ్చింది. ఆయన టైమ్ అంటే టైమే. ఆయనతో పనిచేయడం చాలా ఎగ్జయిటింగ్ ఉంది. బాక్సర్ రితిక 2010 నుంచి నాతో ట్రావెల్ అవుతోంది. ముంతాజ్ కూడా బాక్సర్.. ఇద్దరూ సిస్టర్స్‌గా యాక్ట్ చేశారు. నిర్మాత శశికాంత్ చాలా ఫ్రీడమ్ ఇవ్వడంతో క్వాలిటీ సినిమా వచ్చింది’’ అన్నారు. ‘‘వెంకీ సార్‌ని చూస్తే నా రియల్ గురు గుర్తుకొచ్చారు. ఈ చిత్రం చూశాక చాలా మంది స్ఫూర్తి పొందుతారు’’ అన్నారు రితికా సింగ్. శశికాంత్, ముంతాజ్, సంగీత దర్శకుడు సంతోశ్ నారాయణన్, పాటల రచయిత భాస్కర భట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రాడ్యూసర్ రామ్ తదితరులు పాల్గొన్నారు. -
కమల్, నాజర్, విశాల్‌కు హైకోర్టు నోటీసులు
చెన్నై: నడిగర్ సంఘం భవన నిర్మాణ ఒప్పందం వ్యవహారంలో నటుడు కమలహాసన్, నాజర్, విశాల్, ఎస్వీ.శేఖర్ తదితర తొమ్మిది మందికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకెళ్లితే చెన్నై, తాంబరానికి చెందిన వారాహి అనే నడిగర్‌సంఘం సభ్యుడు చెన్నై నగర హక్కుల విభాగంలో హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ నడిగర్ సంఘం 62వ సర్వసభ్య సమావేశంలో సంఘ భవనాన్ని నిర్మించాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారన్నారు. అదే విధంగా సంఘ సభ్యులతో చర్చించకుండానే బెంగళూర్‌కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థతో సంఘ భవన నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. అందువల్ల ఆ ఒప్పందాన్ని రద్దు చేసి సంఘ సభ్యులందరితో చర్చించి నూతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. వారాహి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నడిగర్‌సంఘం అధ్యక్షుడు నాజర్ , కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ, సంఘ ట్రస్ట్ సభ్యులు కమలహాసన్, కుట్టిపద్మిని, ఎస్వీ.శేఖర్, పూచిమురుగన్ మొదలగు తొమ్మిది మందికి బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను 19 తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
అనుష్క నా కూతురులాంటిది
చెన్నై : నటి అనుష్క నా కూతురులాంటిదని నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ వ్యాఖ్యానించారు. ఆర్య, అనుష్క జంటగా నటించిన తాజా చిత్రం ఇంజి ఇడుప్పళగి, తెలుగులో జీరో సైజ్ పేరుతో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని పీవీపీ సినిమా నిర్మించింది. కేఎస్ ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మరగథమణి(కీరవాణి) సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక అన్నాసలైలోని సత్యం సినీ థియేటర్లో జరిగింది. చిత్ర ఆడియోను నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ఆవిష్కరించి ఇతర ముఖ్య అతిథులకు చిత్ర యూనిట్‌కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది సంగీత దర్శకుడు మరగథమణి వేడుక రోజు అన్నారు. ఆయన ఇళయరాజాకు ధీటుగా సంగీతాన్ని అందిస్తున్నారని ప్రశంసించారు. అందుకు బాహుబలిలాంటి పలు చిత్రాలే సాక్ష్యంగా పేర్కొన్నారు. సొంత గుర్తింపు కోసం పోరాడుతున్న ఈ చిత్ర దర్శకుడు కేఎస్ ప్రకాశరావు తనకు నటుడిగానే పరిచయం అన్నారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఒక ఆంగ్ల చిత్రంలో తాను నటించానని తెలిపారు. ప్రకాశరావు ప్రఖ్యాత దర్శకుడు కె.రాఘవేంద్రరావు కొడుకనే గుర్తింపు ఉన్నా తన కంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ఆయన తపన పడుతున్నారని... అది ఈ చిత్రంతో లభిస్తుందని భావిస్తున్నానని అన్నారు. ఆర్య అమ్మాయిలతోనే మాట్లాడుతారు: ఈ చిత్ర కథా నాయకుడు ఆర్య గురించి చెప్పాలంటే తాను హీరోయిన్లతోనే ఎక్కువగా మాట్లాడుతారని చాలామంది అనుకుంటారని, ఆయనతో తాను మూడు చిత్రాలలో నటించానని చెప్పారు. ఆర్య అందరితోను సరదాగా మాట్లాడుతారని,తనతో ఎంతసేపు ఆయన మాట్లాడవచ్చునని అన్నారు. కథ తన చుట్టూనే తిరగాలి, పోరాట సన్నివేశాలు ఉండాలని కాకుండా మంచి కథా పాత్రలు ఎంచుకుంటూ నటిస్తున్న ఆర్యను అభినందించాలి అన్నారు. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా రాలేదు: తానీ కార్యక్రమానికి ఒక నటుడిగానో, లేక దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడిగానో రాలేదన్నారు. తన కూతురు అనుష్క ఒక వైవిధ్య భరిత పాత్రలో నటించారనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని అన్నారు. ఇందులో నటించే ముందు అనుష్క ఈ చిత్ర కథను తనకు చెప్పిందని ఇలాంటి పాత్రలో నటించనున్నానని చెప్పగానే చాలా సంతోషం కలిగిందన్నారు. చిత్ర ఖర్చుకు తగ్గ హాలీవుడ్, లేదా బాలీవుడ్ మేకప్ నిపుణుడిని నటుడు కమలహాసన్ సలహా తీసుకుని తెలియజేస్తానని చెప్పానన్నారు. అందుకామె లేదు సార్ తాను పాత్రకు తగ్గట్టుగా బరువు పెంచి నటించాలని నిర్ణయించుకున్నానని చెప్పారన్నారు. ఈ చిత్రంలో బరువు పెంచి నటించినా అనుష్క అందంగానే ఉన్నారని నాజర్ అన్నారు. ఇంజి ఇడుప్పళగి ఒక సాధారణ చిత్రంలా కాకుండా వినూత్నంగా చక్కని హాస్యం మేళవించిన చిత్రంగా ఉంటుందని భావిస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అనుష్క, ఆర్య, మరగథమణి, చిత్ర దర్శకుడు కేఎస్ ప్రకాశరావులతో పాటు పలువురి సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
నాజర్‌కిది భిన్నమైన అనుభవం
ప్రేక్షకులను సరికొత్త లోకంలో విహరించేలా తెరకె క్కిన చిత్రం ‘కదిలే బొమ్మల కథ’. సీనియర్ నటుడు నాజర్ ముఖ్యపాత్రలో తె లుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రాన్ని శశిధర్ బోయినపల్లి దర్శకత్వంలో అజయ్ మేరుగు నిర్మించారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇప్పటివరకూ తాను చేసిన సినిమాల కంటే భిన్నమైన అనుభూతినిచ్చిన చిత్రమిదని నాజర్ పేర్కొన్నారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం కచ్చితంగా అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుందని దర్శక,నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రావుల నరేశ్, ఛాయాగ్రహణం: తిరుమల రావు. -
కోలుకుంటున్న నాజర్ కుమారుడు
చెన్నై : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నటుడు నాజర్ కుమారుడు ఫైజల్ కోలుకుంటున్నాడు. తన స్నేహితులతో కలిసి అతను గురువారం పుదుచ్చేరి నుంచి చెన్నైకు కారులో వస్తుండగా ట్యాంకర్ లారీ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు చెందగా, ఫైజల్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగినప్పుడు ఫైజల్ కారు వెనుక సీటులో కూర్చున్నాడు. ప్రస్తుతం అతడు కేలంబాక్కంలోని చెట్టినాడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫైజల్ ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. చికిత్సకు అతని శరీరం సహకరిస్తున్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. కాగా ఫైజల్ తమిళ చిత్రం 'శివం'కు గ్రాఫిక్ డిజైనర్ గా పని చేశాడు. -
సినిమా రివ్యూ: వీరుడొక్కడే
తమిళంలో ఘన విజయం సాధించిన 'వీరం' చిత్రం 'వీరుడొక్కడే'గా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజిత్, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. అన్యాయం, చెడు, ఫ్యాక్షన్‌ను ఎదిరించి...మంచి కోసం ఎంతవరకైనా తెగించే మనస్తత్వం కల వ్యక్తి వీరేంద్ర(అజిత్). తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన నలుగురు సోదరుల కోసం వీరేంద్ర పెళ్లికి దూరంగా ఉంటాడు. అన్యాయం, అక్రమాలను పాల్పడే వీరభద్రం (ప్రదీప్ రావత్) దుశ్చర్యల నుంచి ప్రజల్ని కాపాడుతుంటాడు. ఈ క్రమంలో తన సహచరులతో ఆ గ్రామంలోకి ప్రవేశించిన గోమతి దేవి (తమన్నా) అనే అర్కిటెక్ట్.. వీరేంద్ర ప్రేమలో పడేలా నలుగురు సోదరులు ప్లాన్ చేస్తారు. వీరేంద్ర మంచితనాన్ని చూసి గోమతి ప్రేమలో పడుతుంది. గోమతి ప్రేమ కోసం ఫ్యాక్షన్ కు దూరంగా ఉండాలని వీరేంద్ర నిర్ణయం తీసుకుంటాడు. తమ గ్రామంలో నాగరాజు (అతుల్ కులకర్ణి) గ్రూప్‌తో జరిగిన సంఘటన ప్రభావంతో హింస, గొడవలు, కొట్లాట, ఫ్యాక్షన్ వ్యవహారాలకు దూరంగా ఉండాలని గోమతి కుటుంబం నిర్ణయం తీసుకుంటుంది. వీరేంద్రను పెళ్లి చేసుకుందామనుకునుకున్న తరుణంలో గోమతిపై నాగరాజు గ్రూప్ ఎటాక్ చేస్తుంది. నాగరాజు గ్రూపును వీరేంద్ర ఎదుర్కొని.. గోమతిని ఆ దాడి నుంచి రక్షిస్తాడు.. అయితే ఆ సంఘటనలో వీరేంద్ర అసలు రూపాన్ని గోమతి చూస్తుంది. తనకు ఇష్టం లేని వ్యవహారాలే వీరేంద్ర జీవితంలో ప్రధానమైనవని తెలుసుకున్న గోమతి షాక్ అవుతుంది. వీరేంద్ర అసలు జీవితం తెలుసుకున్న తర్వాత గోమతి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? గోమతిపై ఎటాక్ ఎందుకు జరిగింది. నాగరాజు అసలు గోమతి కుటుంబంపై ఎందుకు పగ పెంచుకుంటాడు? నాగరాజు, వీరభద్రం గ్రూప్‌ల ఆటకట్టించి.. గోమతిని, తన కుటుంబాన్ని వీరేంద్ర ఎలా రక్షించుకున్నాడనే ప్రశ్నలకు సమాధానమే ’వీరుడొక్కడు’. మాస్, యాక్షన్ ఎలిమెంట్ పుష్కలంగా ఉన్న వీరేంద్ర పాత్రలో అజిత్ కనిపించారు. ప్రేమ కోసం హింస, ఫ్యాక్షన్ కు స్వస్తి చెప్పిన వ్యక్తిగా, ప్రేయసి కోసం, ప్రేమను పంచిన కుటుంబం కోసం ఎంతవరకైనా వెళ్లే మరో షేడ్ ఉన్న క్యారెక్టర్‌ను అజిత్ అవలీలగా పోషించాడు. అయితే గతంలో చాలా చిత్రాల్లోఇలాంటి పాత్రల్లో కనిపించిన అజిత్.. మరోసారి రొటీన్‌గానే అనిపించాడు. అర్కిటెక్ట్‌గా గోమతి పాత్రలో ఓ సంప్రదాయ యువతిగా తమన్నా కనిపించింది. ఈ చిత్రంలో గోమతి పాత్ర ప్రధానమైనప్పటికి... సహజంగా ప్రేక్షకులు ఆశించే గ్లామర్ మిస్ కావడం నిరాశ కలిగించే అంశం. గోమతి పాత్ర కారెక్టరైజేషన్ పర్ ఫెక్ట్‌గా లేకపోవడం కొంత మైనస్. అంతేకాకుండా గోమతి పాత్ర కృత్రిమంగా కనిపిస్తుంది. విలన్లు ప్రదీప్ రావత్, అతుల్ కులకర్ణి తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించినా.. చిత్రంలో పూర్తిస్థాయిలో ప్రభావం చూపేలా విలనిజం లేకపోవడం ప్రధాన లోపమని చెప్పవచ్చు. తమన్నా తండ్రిగా నాజర్ పర్వాలేదనిపించారు. ఈ చిత్రంలో బాగా నచ్చే అంశం లాయర్ పాత్రలో సంతానం పండించిన కామెడీ. సంతానం కామెడి ప్రేక్షకులకు ఊరట కలిగిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం గొప్పగా ఆకట్టుకోలేకపోయింది. అయితే కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. వెట్రీ ఫోటోగ్రఫి చిత్రానికి అదనపు ఆకర్షణ. యాక్షన్ సీన్ల చిత్రీకరణ రిచ్‌గా ఉంది. భూపతి రాజా, శివ అందించిన కథలో కొత్తదనం లేకపోయింది. సంతానంపై చిత్రీకరించిన కామెడీ సీన్లలో డైలాగ్స్ బ్రహ్మండంగా పేలాయి. తమిళంలో ‘వీరం’ పేరుతో విడుదలై.. ఘన విజయాన్ని సాధించిన వీరుడొక్కడే చిత్రం తెలుగు ప్రేక్షకులకు రొటీన్ చిత్రమనే చెప్పవచ్చు. పగ, ప్రతీకారం, ఫ్యాక్షన్ అంశాలే ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.