హీరో మహేశ్ బాబుకి యాక్టింగ్ క్లాసులు.. కొత్తగా ఆ విషయాల్లో? | Mahesh Babu Tutoring By Nassar For SSMB29 Rajamouli Film, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Mahesh Babu: రాజమౌళి మూవీ కోసం మహేశ్ సరికొత్తగా!

Published Mon, Jul 8 2024 9:28 PM | Last Updated on Tue, Jul 9 2024 12:28 PM

Mahesh Babu Tutoring By Nassar For SSMB29 29 Rajamouli

సూపర్ స్టార్ మహేశ్ బాబుకి యాక్టింగ్ మళ్లీ కొత్తగా యాక్టింగ్ క్లాసులా? ఎందుకు ఏమైందని అనుకుంటున్నారా? ఈ మధ్య వెకేషన్ ముగించుకుని ఇంటికొచ్చేసిన మహేశ్.. ప్రస్తుతం రాజమౌళి మూవీకి జరుగుతున్న ప్రీ ప్రొడక్షన్‌లో బిజీ అయిపోయాడు. ఈ క్రమంలోనే మహేశ్ కొత్తగా కొన్ని విషయాల్లో మారేందుకు రెడీ అయిపోతున్నాడనే న్యూస్ బయటకొచ్చింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సుధీర్ బాబు యాక్షన్ మూవీ... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)

ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేశ్... రాజమౌళితో కలిసి ఇప్పుడు పనిచేయబోతున్నాడు. స్క్రిప్ట్ లాక్ అయిపోయింది. దీంతో ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్, ఇతరత్రా వర్క్ అంతా జరుగుతోంది. ఇందులో భాగంగానే మూవీలో మహేశ్ బాబు పాత్ర యాస, యాక్టింగ్ విషయంలో నాజర్ మెలకువలు నేర్పిస్తున్నారట. అంటే రాజమౌళి ప్రాజెక్ట్ కోసం సరికొత్త మహేశ్‌ని చూడబోతున్నమాట.

ఇదిలా ఉండగా త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి SSMB 29 గురించి రాజమౌళి చెప్పబోతున్నారు. గతంలో ఓసారి మాట్లాడుతూ 'గ్లోబ్‌ట్రాటింగ్' స్టోరీగా ఉండబోతుందని చెప్పారు. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఇంటర్నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న రాజమౌళి.. మహేశ్‌తో ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియాలంటే మరికొన్నేళ్లు ఆగాల్సిందే.

(ఇదీ చదవండి: 'హనుమాన్' దర్శకుడికి చేదు అనుభవం.. ఏం జరిగిందంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement