ఇపో (మలేసియా): ఆసియా హాకీలో భారత్ జయభేరి మోగించింది. బంగ్లాదేశ్‌పై 9-1 గోల్స్ తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. వచ్చే ఏడాది ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే కచ్చితంగా ఆసియాకప్ టైటిల్ గెలవాల్సిన స్థితిలో భారత జట్టు స్ఫూర్తిదాయకంగా ఆడుతోంది. ఆసియా కప్ హాకీ విజేతకే వల్డ్ కప్ అర్హత నేరుగా లభిస్తుంది. దక్షిణ కొరియా ఇది వరకే వల్డ్ కప్ అర్హత సాధించింది.
దక్షిణ కొరియాతో సోమవారం జరిగిన పూల్ బి మ్యాచ్‌లో 2-0తో భారత్ విజయం సాధించింది. తొలి మ్యాచ్లో హాకీ బేబీలైన ఒమన్ జట్టుపై 8-0తో గెలిచిన భారత్, కొరియాపై విజయంతో సెమీస్‌కు చేరింది. చివరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టుపై విజయం సాధించింది.
బంగ్లాదేశ్పై భారత్ ఘనవిజయం: ఆసియా హాకీ
Published Wed, Aug 28 2013 8:05 PM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
Advertisement
Advertisement