
కౌలాలంపూర్: సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ జూనియర్ హాకీ టోర్నీలో భారత జట్టు మూడో సారి చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో భారత్ ‘షూటౌట్’లో 5–4తో ఆ్రస్టేలియాపై నెగ్గి 2014 తర్వాత ఈ టోర్నీలో మళ్లీ టైటిల్ సొంతం చేసుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలువడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. భారత్ తరఫున సుదీప్ చిర్మాకో (14వ నిమిషం) గోల్ చేయగా.. ఆసీస్ తరఫున జాక్ హాలండ్ 29వ నిమిషంలో గోల్ చేశాడు. టైటిల్ నెగ్గిన భారత జట్టులోని సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. భారత్.. 2013, 2014ల్లో ఈ ట్రోఫీ నెగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment