Sultan of Johor Cup junior hockey tournament
-
ఫైనల్లో ఆసీస్‌పై విజయం.. మూడోసారి విజేతగా నిలిచిన భారత్
కౌలాలంపూర్: సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ జూనియర్ హాకీ టోర్నీలో భారత జట్టు మూడో సారి చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో భారత్ ‘షూటౌట్’లో 5–4తో ఆ్రస్టేలియాపై నెగ్గి 2014 తర్వాత ఈ టోర్నీలో మళ్లీ టైటిల్ సొంతం చేసుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలువడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. భారత్ తరఫున సుదీప్ చిర్మాకో (14వ నిమిషం) గోల్ చేయగా.. ఆసీస్ తరఫున జాక్ హాలండ్ 29వ నిమిషంలో గోల్ చేశాడు. టైటిల్ నెగ్గిన భారత జట్టులోని సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. భారత్.. 2013, 2014ల్లో ఈ ట్రోఫీ నెగ్గింది. -
Sultan of Johor Cup: ఫైనల్లో భారత్
జొహొర్ (మలేసియా): సుల్తాన్ ఆఫ్ జొహొర్ కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం బ్రిటన్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌ను భారత్ 5–5తో ‘డ్రా’గా ముగించినా తుది పోరుకు అర్హత సాధించడంలో సఫలమైంది. భారత్ తరఫున పూవన్న (7వ నిమిషం), అమన్‌దీప్ (50), అరైజీత్ సింగ్ (53), శార్దా నంద్ (56, 58) గోల్స్ సాధించారు. బ్రిటన్ ఆటగాళ్లలో మ్యాక్స్ అండర్నస్ (1వ నిమిషం, 40వ), జామీ గోల్డెన్ (54, 56) రెండేసి గోల్స్ కొట్టగా, హారిసన్ స్టోన్ (42) మరో గోల్ నమోదు చేశాడు. ఐదు మ్యాచ్‌ల తర్వాత 7 పాయింట్లు సాధించిన భారత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. 4 మ్యాచ్‌ల ద్వారానే 10 పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా ముందే ఫైనల్‌కు అర్హత సాధించగా, ఫైనల్ స్థానం కోసం దక్షిణాఫ్రికాతో భారత్ పోటీలో నిలిచింది. అయితే తర్వాత జరిగిన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6–1 తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేయడంతో భారత్ ముందంజ వేసింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
Sultan of Johor Hockey: భారత్ 5 ఆస్ట్రేలియా 5
కౌలాలంపూర్: సుల్తాన్ ఆఫ్ జొహొర్ కప్ జూనియర్ హాకీ టోర్నీలో భారత జట్టు తొలి ‘డ్రా’ నమోదు చేసింది. ఆస్ట్రేలియా జట్టుతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌ను భారత్ 5–5తో ‘డ్రా’గా ముగించింది. మ్యాచ్ చివరి నిమిషంలో అమన్‌దీప్ గోల్ చేసి భారత్‌ను ఆదుకున్నాడు. శారదానంద్ తివారి (8వ, 35వ ని.లో) రెండు గోల్స్... బాబీ సింగ్ ధామి (2వ ని.లో), అర్జింత్ సింగ్ హుండల్ (18వ ని.లో) ఒక్కోగోల్ సాధించారు. ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. రెండు విజయాలు, ఒక ‘డ్రా’, ఒక ఓటమితో భారత్ ఏడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను శుక్రవారం బ్రిటన్ జట్టుతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్ చేరుతుంది. -
పాక్‌తో భారత్ పోరు
న్యూఢిల్లీ: సుల్తాన్ ఆఫ్ జొహార్ కప్ జూనియర్ హాకీ టోర్నీలో భారత్ తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్తాన్ తో ఆడనుంది. వచ్చే నెల 11 నుంచి 18 వరకు మలేసియాలోని జోహోర్ బహ్రూలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. వరుసగా రెండుసార్లు డిఫెండింగ్ చాంపియన్‌గా ఉన్న భారత్ ఈసారీ ఫేవరెట్‌గా ఉం డగా పాక్, గ్రేట్ బ్రిటన్, అర్జెంటీనా, ఆసీస్, మలేసియా పోటీ పడుతున్నాయి. ‘వరుసగా మూడోసారి టైటిల్ గెల వాలనే పట్టుదలతో ఉన్నాం. అదే జరిగితే ఎనిమిదో పురుషుల జూనియర్ ఆసియా కప్‌కు ఆత్మవిశ్వాసం తో వెళ్లగలం. అంచనాలకు అనుగుణంగానే రాణించగలమనే నమ్మకం ఉంది’ అని హాకీ ఇండియా ప్రధా న కార్యదర్శి మహ్మద్ ముష్తాక్ అహ్మద్ అన్నారు.