సుల్తాన్ ఆఫ్ జొహార్ కప్ జూనియర్ హాకీ టోర్నీలో భారత్ తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్తాన్ తో ఆడనుంది. వచ్చే నెల 11 నుంచి
న్యూఢిల్లీ: సుల్తాన్ ఆఫ్ జొహార్ కప్ జూనియర్ హాకీ టోర్నీలో భారత్ తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్తాన్ తో ఆడనుంది. వచ్చే నెల 11 నుంచి 18 వరకు మలేసియాలోని జోహోర్ బహ్రూలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. వరుసగా రెండుసార్లు డిఫెండింగ్ చాంపియన్‌గా ఉన్న భారత్ ఈసారీ ఫేవరెట్‌గా ఉం డగా పాక్, గ్రేట్ బ్రిటన్, అర్జెంటీనా, ఆసీస్, మలేసియా పోటీ పడుతున్నాయి.
‘వరుసగా మూడోసారి టైటిల్ గెల వాలనే పట్టుదలతో ఉన్నాం. అదే జరిగితే ఎనిమిదో పురుషుల జూనియర్ ఆసియా కప్‌కు ఆత్మవిశ్వాసం తో వెళ్లగలం. అంచనాలకు అనుగుణంగానే రాణించగలమనే నమ్మకం ఉంది’ అని హాకీ ఇండియా ప్రధా న కార్యదర్శి మహ్మద్ ముష్తాక్ అహ్మద్ అన్నారు.