
పాక్‌తో మ్యాచ్‌కు 20 వేల మంది భారతీయులు
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వచ్చే ఏడాది జరిగే ఈ మెగా టోర్నీలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ను వీక్షించేందుకు 20 వేల మంది భారతీయులు తమ దేశానికి వచ్చే అవకాశం ఉందని దక్షిణ ఆస్ట్రేలియా ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఫిబ్రవరి 15న అడిలైడ్ ఓవల్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది.
50వేలకు పైగా సామర్థ్యం ఉన్న ఈ స్టేడియం సాధారణ టిక్కెట్లు కేవలం 12 నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. అయితే అభిమానులు ఇప్పటికీ హాలీడే, బిజినెస్ ప్యాకేజి టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చని దక్షిణ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్ జాన్ రౌ తెలిపారు.