కౌలాలంపూర్: సుల్తాన్ ఆఫ్ జొహొర్ కప్ జూనియర్ హాకీ టోర్నీలో భారత జట్టు తొలి ‘డ్రా’ నమోదు చేసింది. ఆస్ట్రేలియా జట్టుతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌ను భారత్ 5–5తో ‘డ్రా’గా ముగించింది. మ్యాచ్ చివరి నిమిషంలో అమన్‌దీప్ గోల్ చేసి భారత్‌ను ఆదుకున్నాడు. శారదానంద్ తివారి (8వ, 35వ ని.లో) రెండు గోల్స్... బాబీ సింగ్ ధామి (2వ ని.లో), అర్జింత్ సింగ్ హుండల్ (18వ ని.లో) ఒక్కోగోల్ సాధించారు.
ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. రెండు విజయాలు, ఒక ‘డ్రా’, ఒక ఓటమితో భారత్ ఏడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను శుక్రవారం బ్రిటన్ జట్టుతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్ చేరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment