sultan of johor cup
-
హెడ్ కోచ్ శ్రీజేశ్ ఆధ్వర్యంలో...
బెంగళూరు: భారత సీనియర్ హాకీ జట్టు మేటి గోల్‌కీపర్, ఇటీవల ఆటకు వీడ్కోలు పలికిన పీఆర్ శ్రీజేశ్ కొత్త పాత్రలో కనిపించనున్నాడు. భారత జూనియర్ పురుషుల హాకీ జట్టుకు తొలిసారి హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈనెల 19 నుంచి మలేసియాలో జరిగే సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు శ్రీజేశ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఈ టోర్నీలో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఆదివారం హాకీ ఇండియా ప్రకటించింది. డిఫెండర్లు అమీర్ అలీను కెపె్టన్‌గా, రోహిత్‌ను వైస్ కెపె్టన్‌గా నియమించారు. ఆతిథ్య మలేసియాతోపాటు భారత్, బ్రిటన్, జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక టాప్–2లో నిలిచిన జట్లు 26న జరిగే ఫైనల్లో తలపడతాయి. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను 19న జపాన్‌తో ఆడుతుంది. ఆ తర్వాత బ్రిటన్ (20న), మలేసియా (22న), ఆ్రస్టేలియా (23న), న్యూజిలాండ్ (25న) జట్లతో భారత్ తలపడుతుంది. భారత జట్టు: అమీర్ అలీ (కెపె్టన్), రోహిత్ (వైస్ కెపె్టన్), బిక్రమ్‌జీత్ సింగ్, అలీఖాన్, తాలెమ్ ప్రియోబర్తా, శారదనాంద్ తివారి, సుఖ్వీందర్, అన్మోల్ ఎక్కా, అంకిత్ పాల్, మనీ్మత్ సింగ్, రోషన్ కుజుర్, ముకేశ్ టొప్పో, చందన్ యాదవ్, గుర్జోత్ సింగ్, సౌరభ్ ఆనంద్ కుశ్వా, దిల్‌రాజ్ సింగ్, అర్‡్షదీప్ సింగ్, మొహమ్మద్ కొనైన్ దడ్. -
Sultan of Johor Hockey: భారత్ 5 ఆస్ట్రేలియా 5
కౌలాలంపూర్: సుల్తాన్ ఆఫ్ జొహొర్ కప్ జూనియర్ హాకీ టోర్నీలో భారత జట్టు తొలి ‘డ్రా’ నమోదు చేసింది. ఆస్ట్రేలియా జట్టుతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌ను భారత్ 5–5తో ‘డ్రా’గా ముగించింది. మ్యాచ్ చివరి నిమిషంలో అమన్‌దీప్ గోల్ చేసి భారత్‌ను ఆదుకున్నాడు. శారదానంద్ తివారి (8వ, 35వ ని.లో) రెండు గోల్స్... బాబీ సింగ్ ధామి (2వ ని.లో), అర్జింత్ సింగ్ హుండల్ (18వ ని.లో) ఒక్కోగోల్ సాధించారు. ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. రెండు విజయాలు, ఒక ‘డ్రా’, ఒక ఓటమితో భారత్ ఏడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను శుక్రవారం బ్రిటన్ జట్టుతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్ చేరుతుంది. -
ఫైనల్లో యువ భారత్
జొహర్ బారు (మలేసియా): వరుసగా నాలుగో విజయంతో భారత యువ జట్టు సుల్తాన్ జొహర్ కప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–4తో సంచలన విజయం సాధించింది. దీంతో భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే అగ్రస్థానంలో నిలిచింది. ఆట మొదలైందో లేదో అప్పుడే ఆధిపత్యాన్ని మొదలుపెట్టింది భారత్. ఆరంభంలోనే పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని చేజార్చుకున్నప్పటికీ... ఐదో నిమిషంలోనే భారత్ ఖాతా తెరిచింది. గుర్సాహిబ్జిత్ సింగ్ ఫీల్డ్ గోల్ చేయడంతో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ చేయడంతో తొలి క్వార్టర్‌లోనే భారత్ 4–0తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. హస్‌ప్రీత్ సింగ్ (11వ నిమిషంలో), మన్దీప్ మోర్ (14వ ని.), విష్ణుకాంత్ సింగ్ (15వ ని.), శిలానంద్ లక్రా (43వ ని.) తలా ఒక గోల్ చేశారు. రెండో క్వార్టర్లో భారత డిఫెన్స్ వైఫల్యంతో డామన్ స్టీఫెన్స్ (18వ ని.) ఆస్ట్రేలియాకు తొలి గోల్ అందించాడు. అతనే మళ్లీ 35వ, 59వ, 60వ నిమిషాల్లో మూడు గోల్స్ చేసినా ఆస్ట్రేలియా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. రేపు జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్... బ్రిటన్‌తో తలపడుతుంది. 13న ఫైనల్ జరుగుతుంది. -
భారత యువ జట్టుకు కాంస్యం
న్యూఢిల్లీ: సుల్తాన్ జోహర్ కప్ అంతర్జాతీయ అండర్–21 హాకీ టోర్నీలో భారత పురుషుల జట్టు కాంస్య పతకాన్ని గెల్చుకుంది. మలేసియాలోని జోహర్ బాహ్రులో ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో టీమిండియా 4–0తో మలేసియాను ఓడించింది. భారత్ తరఫున విశాల్ రెండు గోల్స్ చేయగా... వివేక్ ప్రసాద్, శైలానంద్ లాక్రా ఒక్కో గోల్ సాధించారు. -
భారత్ ‘డ్రా’తో సరి
జొహర్ బారు (మలేసియా): వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టుకు మలేసియా బ్రేక్ వేసింది. సుల్తాన్ జొహర్ కప్ అండర్-21 హాకీ టోర్నమెంట్లో భాగంగా శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 3-3తో భారత్‌ను నిలువరించింది. భారత్ తరఫున సత్బీర్ సింగ్ (10వ ని.లో), రమణ్‌దీప్ సింగ్ (33వ ని.లో), అఫాన్ యూసుఫ్ (70వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మలేసియా తరఫున షారిల్ రెండు గోల్స్ (61వ, 68వ ని.లో)... రషీద్ (64వ ని.లో) ఒక గోల్ చేశారు. ఈ మ్యాచ్‌కు ముందే ఈ రెండు జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. దాంతో ఈ ఫలితం రెండు జట్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. ఆరు జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పోటీలు ముగిసిన తర్వాత భారత్, మలేసియా 13 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా భారత్ అగ్రస్థానంలో, మలేసియా రెండో స్థానంలో నిలిచి ఆదివారం జరిగే అంతిమ పోరుకు అర్హత పొందాయి. వరుసగా నాలుగు విజయాలు సాధించి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన భారత్ విరామ సమయానికి 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే చివరి పది నిమిషాల్లో మలేసియా అనూహ్య విజృంభణతో మూడు గోల్స్ సాధించింది. భారత్ ఓటమి ఖాయమనుకున్న దశలో చివరి సెకన్లలో వైస్ కెప్టెన్ అఫాన్ యూసుఫ్ గోల్‌తో టీమిండియా మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. నేటి ఫైనల్ భారత్ x మలేసియా సాయంత్రం గం. 6.00 నుంచి ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఫైనల్లో భారత్
జొహార్ బహ్రూ (మలేసియా): సుల్తాన్ ఆఫ్ జొహర్ కప్ అండర్-21 హాకీ టోర్నీలో భారత కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతున్న ఆటగాళ్లు గురువారం జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లోనూ ఇదే జోరును చూపారు. తమన్ దయా హాకీ స్టేడియంలో దక్షిణ కొరియాతో జరిగిన ఈ మ్యాచ్‌ను భారత్ 6-1 తేడాతో గెలుచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోని భారత్‌కు ఇది నాలుగో విజయం. దీంతో మొత్తం 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి తుది పోరుకు అర్హత సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత జట్టు ఆతిథ్య మలేసియాను ఢీకొంటుంది. మ్యాచ్ ప్రారంభమైన ఏడో నిమిషంలోనే అమిత్ రోహిదాస్ గోల్ చేయగా 9వ నిమిషంలో సత్బార్ సింగ్, 31వ నిమిషంలో తల్వీందర్ సింగ్ చేసిన గోల్స్‌తో ప్రథమార్థంలోనే భారత్ 3-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత మ్యాచ్ చివర్లో కుర్రాళ్లు రె చ్చిపోయారు. అమోన్ మిరాష్ టికే (57వ నిమిషం), రామదీప్ సింగ్ (62), అఫాన్ యూసుఫ్ (65) గోల్స్ కొట్టడంతో భారత్ విజ యం ఖరారైంది. కొరియా నుంచి యు స్యూంగ్ జు 34వ నిమిషంలో గోల్ సాధించాడు. శనివారం జరిగే తమ చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు మలేసియాను ఢీకొంటుంది.