జొహర్ బారు (మలేసియా): వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టుకు మలేసియా బ్రేక్ వేసింది. సుల్తాన్ జొహర్ కప్ అండర్-21 హాకీ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 3-3తో భారత్‌ను నిలువరించింది. భారత్ తరఫున సత్బీర్ సింగ్ (10వ ని.లో), రమణ్‌దీప్ సింగ్ (33వ ని.లో), అఫాన్ యూసుఫ్ (70వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు.
మలేసియా తరఫున షారిల్ రెండు గోల్స్ (61వ, 68వ ని.లో)... రషీద్ (64వ ని.లో) ఒక గోల్ చేశారు. ఈ మ్యాచ్‌కు ముందే ఈ రెండు జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. దాంతో ఈ ఫలితం రెండు జట్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. ఆరు జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పోటీలు ముగిసిన తర్వాత భారత్, మలేసియా 13 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి.
అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా భారత్ అగ్రస్థానంలో, మలేసియా రెండో స్థానంలో నిలిచి ఆదివారం జరిగే అంతిమ పోరుకు అర్హత పొందాయి. వరుసగా నాలుగు విజయాలు సాధించి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన భారత్ విరామ సమయానికి 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే చివరి పది నిమిషాల్లో మలేసియా అనూహ్య విజృంభణతో మూడు గోల్స్ సాధించింది. భారత్ ఓటమి ఖాయమనుకున్న దశలో చివరి సెకన్లలో వైస్ కెప్టెన్ అఫాన్ యూసుఫ్ గోల్‌తో టీమిండియా మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది.
నేటి ఫైనల్
భారత్ x మలేసియా
సాయంత్రం గం. 6.00 నుంచి
ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం
భారత్ ‘డ్రా’తో సరి
Published Sun, Sep 29 2013 1:47 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement
Advertisement