సుల్తాన్ జొహోర్ కప్ హాకీ టోర్నీ బరిలో భారత్
19 నుంచి మలేసియాలో టోర్నీ
బెంగళూరు: భారత సీనియర్ హాకీ జట్టు మేటి గోల్‌కీపర్, ఇటీవల ఆటకు వీడ్కోలు పలికిన పీఆర్ శ్రీజేశ్ కొత్త పాత్రలో కనిపించనున్నాడు. భారత జూనియర్ పురుషుల హాకీ జట్టుకు తొలిసారి హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈనెల 19 నుంచి మలేసియాలో జరిగే సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు శ్రీజేశ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు.
ఈ టోర్నీలో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఆదివారం హాకీ ఇండియా ప్రకటించింది. డిఫెండర్లు అమీర్ అలీను కెపె్టన్‌గా, రోహిత్‌ను వైస్ కెపె్టన్‌గా నియమించారు. ఆతిథ్య మలేసియాతోపాటు భారత్, బ్రిటన్, జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి.
లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక టాప్–2లో నిలిచిన జట్లు 26న జరిగే ఫైనల్లో తలపడతాయి. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను 19న జపాన్‌తో ఆడుతుంది. ఆ తర్వాత బ్రిటన్ (20న), మలేసియా (22న), ఆ్రస్టేలియా (23న), న్యూజిలాండ్ (25న) జట్లతో భారత్ తలపడుతుంది.
భారత జట్టు: అమీర్ అలీ (కెపె్టన్), రోహిత్ (వైస్ కెపె్టన్), బిక్రమ్‌జీత్ సింగ్, అలీఖాన్, తాలెమ్ ప్రియోబర్తా, శారదనాంద్ తివారి, సుఖ్‌వీందర్, అన్‌మోల్ ఎక్కా, అంకిత్ పాల్, మనీ్మత్ సింగ్, రోషన్ కుజుర్, ముకేశ్ టొప్పో, చందన్ యాదవ్, గుర్జోత్ సింగ్, సౌరభ్ ఆనంద్ కుశ్వా, దిల్‌రాజ్ సింగ్, అర్‡్షదీప్ సింగ్, మొహమ్మద్ కొనైన్ దడ్.
Comments
Please login to add a commentAdd a comment