బెంగళూరు: స్వదేశంలో జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు జరిగే పారిస్ ఒలింపిక్స్ మహిళల హాకీ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు గోల్‌కీపర్ సవిత పూనియా నాయకత్వం వహిస్తుంది.
ఈ టోర్నీలో టాప్–3లో నిలిచిన జట్లు పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధిస్తాయి. మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో చిలీ, చెక్ రిపబ్లిక్, జర్మనీ, జపాన్... గ్రూప్ ‘బి’లో భారత్, ఇటలీ, న్యూజిలాండ్, అమెరికా జట్లున్నాయి. భారత్ తమ తొలి లీగ్ మ్యాచ్‌ను 13న అమెరికాతో ఆడుతుంది. ఆ తర్వాత 14న న్యూజిలాండ్‌తో, 16న ఇటలీతో టీమిండియా తలపడుతుంది.
భారత హాకీ జట్టు: సవిత పూనియా (కెపె్టన్, గోల్‌కీపర్), బిచ్చూ దేవి ఖరీబమ్ (గోల్‌కీపర్), నిక్కీ ప్రధాన్, ఉదిత, ఇషికా చౌధరీ, మోనిక, నిషా, వైష్ణవి విఠల్ ఫాలే్క, నేహా, నవ్‌నీత్ కౌర్, సలీమా టెటె, సోనిక, జ్యోతి, బ్యూటీ డుంగ్‌డుంగ్, లాల్‌రెమ్‌సియామి, సంగీత కుమారి, దీపిక, వందన
కటారియా.
Comments
Please login to add a commentAdd a comment