విశ్వక్రీడల్లో తొలిసారి ప్రవేశ పెట్టిన బ్రేక్ డ్యాన్స్ (బ్రేకింగ్) ఈవెంట్‌లో ఇండియా జోరు సాగుతోంది. అదేంటి ఈ విభాగంలో భారత్ నుంచి ఒక్క డాన్సర్ కూడా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు కదా అని అనుకుంటున్నారా.. ఇండియా అంటే భారత్ అనుకుంటే మీరు పొరబడినట్లే. నెదర్లాండ్స్‌కు చెందిన 16 ఏళ్ల యువ డాన్సర్ ఇండియా సర్జో... ‘పారిస్’ క్రీడల్లో తాను పోటీపడుతున్న నాలుగు విభాగాల్లోనూ సెమీ ఫైనల్‌కు చేరింది.
సాధారణంగా బ్రేక్‌డ్యాన్స్‌లో పాల్గొనే డాన్సర్లు ‘బి’ గర్ల్స్, ‘బి’ బాయ్స్ అని ఆసక్తికర పేర్లు వినియోగిస్తారు. కానీ 16 ఏళ్ల సర్జో మాత్రం తన అసలు పేరుతోనే పోటీల్లో దిగింది. ‘బి–గర్ల్ పేరు ఎందుకు పెట్టుకోలేదని చాలా మంది అడుగుతున్నారు. కానీ చిన్నప్పటి నుంచి నాకు అలాంటి ప్రత్యేకమైన పేరు ఎవరూ పెట్టలేదు. అందుకే ఇండియా పేరుతోనే బరిలోకి
దిగుతున్నా’ అని సర్జో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment