పారిస్ ఒలింపిక్స్ పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ఇవాళ (ఆగస్ట్ 8) జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో సెహ్రావత్.. ఉత్తర మాసిదోనియాకు చెందిన వ్లాదిమిర్ ఎగొరోవ్‌పై 10-0 తేడాతో గెలుపొందాడు. ఏకపక్షంగా సాగిన ఈ బౌట్‌లో సెహ్రావత్ ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. ఇవాళే జరిగే క్వార్టర్ ఫైనల్లో సెహ్రావత్.. జెలిమ్‌ఖాన్ అబాకరోవ్ లేదా దియామ్యాంటినో లూనా ఫఫేతో తలపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment