
పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు సెమీ ఫైనల్‌కు చేరింది. ఇవాళ (ఆగస్ట్ 4) జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ పెనాల్టీ షూటౌట్‌లో గ్రేట్ బ్రిటన్‌పై 4-2 తేడాతో గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు చెరో గోల్ సాధించాయి.
THE WINNING MOMENT FROM TEAM INDIA. 🇮🇳
- Down with 10 men, the raw emotions says everything. 🥹❤️pic.twitter.com/FArmg3QtVR— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024
ఈ మ్యాచ్‌లో భారత్ 40 నిమిషాలకు పైగా పది మంది ప్లేయర్లతోనే ఆడింది. మ్యాచ్ తొలి అర్ధ భాగంలో అమిత్ రోహిదాస్ రెడ్ కార్డ్‌కు గురయ్యాడు. ఒలింపిక్స్‌లో భారత్ సెమీస్‌కు చేరడం ఇది వరుసగా రెండోసారి. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది.
PR Sreejesh is a legend. 🫡
- What a save in the Shootout. pic.twitter.com/QJ29ZdrkpY— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024