జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌చాంపియన్ భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. మస్కట్ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 3–1 తేడాతో జపాన్‌ను చిత్తు చేసి ముందంజ వేసింది.
భారత్ తరఫున ముంతాజ్ ఖాన్ (4వ నిమిషంలో), సాక్షి రాణా (5వ ని.లో), దీపిక (13వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. జపాన్ తరఫున నికో మరుయమా (23వ ని.లో) ఏకైక గోల్ సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన భారత జట్టు రెండో నిమిషంలోనే గోల్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నా... మరో 2 నిమిషాల తర్వాత ముంతాజ్ ఖాన్ గోల్‌తో ఖాతా తెరిచింది.
అదే ఊపులో తొలి క్వార్టర్‌లోనే మరో రెండు గోల్స్ చేసిన భారత్... ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించింది. దీపికకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment