under-21
-
భారత వాలీబాల్ జట్టుకు నిరాశ
మనామా (బహ్రెయిన్): ప్రపంచ అండర్–21 పురుషుల వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. గ్రూప్ లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు పరాజయం చవిచూసింది. తద్వారా నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. పూల్ ‘సి’లో ఉన్న భారత జట్టు తొలి మ్యాచ్‌లో 17–25, 14–25, 25–20, 19–25తో పోలాండ్ చేతిలో... రెండో మ్యాచ్‌లో 19–25, 25–22, 27–29, 13–25తో బల్గేరియా చేతిలో... మూడో మ్యాచ్‌లో 25–18, 27–29, 20–25, 22–25తో కెనడా చేతిలో ఓడిపోయింది. పదేళ్ల తర్వాత మళ్లీ ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించిన భారత జట్టు తదుపరి 9 నుంచి 16 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు ఆడుతుంది. -
39 ఏళ్ల తర్వాత.. యూరో అండర్-21 చాంపియన్ ఇంగ్లండ్
అండర్-21 యూరోపియన్ చాంపియన్‌షిప్ విజేతగా ఇంగ్లండ్ అవతరించింది. 1984 తర్వాత ఇంగ్లండ్ మళ్లీ చాంపియన్‌గా నిలవడం ఇదే. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత స్పెయిన్‌తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 1-0తో విజయం సాధించింది. ఇంగ్లండ్ తరపున వచ్చిన ఏకైక గోల్ కర్టిస్ జోన్స్ ఆట 45+4వ నిమిషం(అదనపు)లో గోల్ అందించాడు. ఇక రెండో అర్థభాగంలో స్పెయిన్ అదే పనిగా గోల్ పోస్టులపై దాడులు చేసింది. అయితే ఇంగ్లండ్ గోల్‌కీపర్ జేమ్స్ ట్రాఫర్డ్ రెండుసార్లు స్పెయిన్ పెనాల్టీ కిక్‌లు గోల్ చేయకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. దీంతో టోర్నీలో ప్రత్యర్థి జట్లకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా ఇంగ్లండ్ యూరో అండర్-21 విజేతగా నిలవడం విశేషం. 🏴 Trafford at the death! 😱#LastMinuteMoments | #U21EURO | @Hublot pic.twitter.com/YJNCJBJyV5 — #U21EURO (@UEFAUnder21) July 8, 2023 England's crowning moment 🏆🎉#U21EURO pic.twitter.com/DnsTcDdihc — #U21EURO (@UEFAUnder21) July 8, 2023 చదవండి: #BjornBorg: 18 ఏళ్లకే సంచలనాలు.. 70వ దశకాన్ని శాసించిన టెన్నిస్ దిగ్గజం IND vs AFG: టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్.. ఆ సిరీస్‌కు ముహూర్తం ఖరారు! -
భారత్ ‘డ్రా’తో సరి
జొహర్ బారు (మలేసియా): వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టుకు మలేసియా బ్రేక్ వేసింది. సుల్తాన్ జొహర్ కప్ అండర్-21 హాకీ టోర్నమెంట్లో భాగంగా శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 3-3తో భారత్‌ను నిలువరించింది. భారత్ తరఫున సత్బీర్ సింగ్ (10వ ని.లో), రమణ్‌దీప్ సింగ్ (33వ ని.లో), అఫాన్ యూసుఫ్ (70వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మలేసియా తరఫున షారిల్ రెండు గోల్స్ (61వ, 68వ ని.లో)... రషీద్ (64వ ని.లో) ఒక గోల్ చేశారు. ఈ మ్యాచ్‌కు ముందే ఈ రెండు జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. దాంతో ఈ ఫలితం రెండు జట్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. ఆరు జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పోటీలు ముగిసిన తర్వాత భారత్, మలేసియా 13 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా భారత్ అగ్రస్థానంలో, మలేసియా రెండో స్థానంలో నిలిచి ఆదివారం జరిగే అంతిమ పోరుకు అర్హత పొందాయి. వరుసగా నాలుగు విజయాలు సాధించి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన భారత్ విరామ సమయానికి 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే చివరి పది నిమిషాల్లో మలేసియా అనూహ్య విజృంభణతో మూడు గోల్స్ సాధించింది. భారత్ ఓటమి ఖాయమనుకున్న దశలో చివరి సెకన్లలో వైస్ కెప్టెన్ అఫాన్ యూసుఫ్ గోల్‌తో టీమిండియా మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. నేటి ఫైనల్ భారత్ x మలేసియా సాయంత్రం గం. 6.00 నుంచి ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం