జొహర్ బారు (మలేసియా): సుల్తాన్ జొహర్ కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 3–2తో జపాన్‌ను ఓడించింది. భారత్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్ (11వ, 53వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... సుఖ్‌జీత్ సింగ్ (41వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. జపాన్ జట్టుకు క్యోహి ఒగవా (23వ, 31వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించాడు. సోమవారం జరిగే తమ రెండో లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment