woman harassment case
-
ఎంపీ ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ
బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ, మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి లైంగిక దాడి, వైరలైన అభ్యంతర వీడియోల వ్యవహారంపై కేసు నమోదైంది. ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. తాజాగా తొలిసారి ఈ వ్యవహారంపై మాజీ ప్రధాని దేవెగౌడ స్పందించారు. ‘‘ప్రజ్వల్ రేవణ్ణపై నేరం నిరూపణ అయి దోషిగా తేలితే.. చర్యలు తీసుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. హెచ్డీ రేవణ్ణపై మహిళల వేధింపు, కిడ్నాప్ కేసులు కావాలని సృష్టించినవి’ అని దేవెగౌడ్ అన్నారు. ‘‘హెచ్ డీ రేవణ్ణకు సంబంధించిన కేసు కోర్టు ఉంది. అందుకే నేను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. ప్రజ్వల్ విదేశంలో ఉన్నాడు. ఈ వ్యవహరంలో చట్టపరంగా చర్యలు తీసుకోవటం ప్రభుత్వం విధి. మహిళ వేధింపుల కేసులో ఇంకా చాలా మందికి సంబంధం ఉంది. నేను ఎవరీ పేరును బయటపెట్టాలనుకోవటం లేదు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని, వారికి నష్ట పరిహారం అందిచాలని ఇప్పటికే హెచ్డీ కుమారస్వామి పేర్కొన్నారు’’ అని దేవెగౌడ అన్నారు.ఇక.. ప్రజ్వల్‌కు సంబంధించిన లైంగిక దాడి కేసులో కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనుసాగుతోంది. అభ్యంతరమైన వీడియోలు వైరల్ అయిన అనంతరం జర్మనీ వెళ్లిపోయిన ప్రజ్వల్ ఇంకా భారత్‌కు తిరిగిరాకపోవటం గమనార్హం. -
హైదరాబాద్: మహిళలపై వేధింపులు తగ్గట్లే!
సాక్షి, హైదరాబాద్: మహిళలపై వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత రెండు నెలల్లో సైబరాబాద్ షీ టీమ్‌కు 256 ఫిర్యాదులు అందాయి. అత్యధికంగా వాట్సాప్ ద్వారా 214 ఫిర్యాదులు అందగా.. భౌతికంగా 22, ట్విట్టర్ ద్వారా 3, హ్యాక్ ఐలో 8, ఈ–మెయిల్ ద్వారా 2, హెచ్ఓడీ ద్వారా ఏడు ఫిర్యా దులు వచ్చాయి. 55 ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేయగా.. వీటిల్లో 14 క్రిమినల్ కేసులు, 41 పెట్టీ కేసులున్నాయి. ఫోన్ వేధింపులే ఎక్కువ.. సామాజిక మాధ్యమాల ద్వారా లేదా తెలిసిన వ్యక్తుల ద్వారా మహిళల నెంబర్లను సేకరించి ఫోన్లో వేధిస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. గత రెండు నెలల్లో సైబరాబాద్ పరిధిలో 103 ఫిర్యాదులు ఈ తరహావే ఉండటం గమనార్హం. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ఘటనలో 17 ఫిర్యాదులు, సోషల్ మీడియాలో వేధింపులు 32, వెంబడిస్తూ వేధించే కేసులు 22, అసభ్య ప్రవర్తన 11, బ్లాక్‌మెయిలింగ్ 25 కేసులు వంటి ఫిర్యాదులున్నాయి. మహిళలను వేధిస్తున్న పోకిరీలలో మైనర్లే ఎక్కువగా ఉంటున్నారు. గత రెండు నెలల్లో పట్టుబడిన 144 మంది ఆకతాయిలలో 53 మంది మైనర్లే ఉండటం గమనార్హం. 52 మంది 19–24 మధ్య వయస్సున్న వాళ్లు, 34 మంది 25–35 ఏళ్లు, 5 మంది 36–50 ఏళ్ల వయసు ఉన్నవాళ్లున్నారు. ఫోన్లో వార్నింగ్.. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో సైబరాబాద్ పరిధిలోని బస్ స్టాప్‌లు, షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్లు, ట్యుటోరియల్స్, కాలేజీ వంటి పలు ప్రాంతాలలో 975 డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించారు. 70 మంది పోకిరీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోగా.. వీటిల్లో 44 పెట్టీ కేసులు బుక్ చేశారు. మిగిలిన పోకిరీలను కౌన్సిలింగ్‌కు పంపించారు. గడిచిన రెండు నెలల్లో 622 అవగాహన సదస్సులు నిర్వహించగా.. 8,851 మంది పాల్గొన్నారు. 112 మంది పోకిరీలకు ప్రవర్తన మార్చుకోవాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఫోన్లో వార్నింగ్ ఇచ్చారు. -
లైంగిక వేధింపులు..ఆపై కాల్పులు
లక్నో: మహిళలపై పోలీస్ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అజమ్గర్లో చోటుచేసుకుంది. రోడ్డుపైనే చిత్తుగా తాగడమే కాకుండా మహిళల పట్ల అసభ్యప్రవర్తించాడు సదరు పోలీస్ అధికారి. అంతటి ఆగకుండా అతని ప్రవర్తనను అడ్డుకున్న కిషన్ లాల్ అనే వ్యక్తిపై ఆ అధికారి కాల్పులకు పాల్పడ్డాడు. చదవండి(యూపీలో జర్నలిస్టు పాశవిక హత్య...) వివరాల్లోకి వెళితే.. కమల్పూర్ గ్రామంలో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యేందుకు మహిళలు వెళ్తున్నారు. నిందితుడు, అతని స్నేహితులు రోడ్డుపై మద్యం సేవిస్తూ, దారివెంట వెళ్లే మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారు. కిషన్ లాల్ అభ్యంతరం చెప్పగా...గొడవ మొదలైంది. ఈ క్రమంలో నిందితుడు అతడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన సారామైర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్ అధికారిని సర్వేశ్గా గుర్తించారు. అతడితో సహా మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, భారత శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన కిషన్ లాల్‌ని మెరుగైన చికిత్స కోసం వారణాసికి తరలించారు. -
ప్రేమించి...కాదన్న 'ఐపీఎస్'
వరకట్నం కేసులో ఐపీఎస్ అధికారి వరుణ్‌కుమార్‌కు మే 12వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నై వలసరవాక్కానికి చెందిన ప్రియదర్శిని (25) వరుణ్‌కుమార్ ప్రేమలో పడ్డారు. ఇరుకుటుంబాల అంగీకారం తో 2011లో వీరికి వివాహం నిశ్చయమైంది. ఆ సమయంలో వధువు తరపు నుంచి నగలు, నగదు ఇవ్వడానికి నిర్ణయించారు. ఆ తర్వాత వరుణ్‌కుమార్ ఐపీఎస్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అనంతరం ప్రియదర్శినిని వివాహం చేసుకునేందుకు వరుణ్‌కుమార్ నిరాకరించారు. దీనిపై ప్రియదర్శిని చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందులో తనను వివాహం చేసుకుంటానని తెలిపి, నిశ్చ యం చేసుకున్న వరుణ్‌కుమార్ ఐపీఎస్ అధికారి కాగానే మోసగించారని తెలిపారు. అంతేకాకుండా తమ వద్ద 50 లక్షల రూపాయల నగదు, రెండు కిలోల బంగారం వరకట్నంగా కోరిన ట్లు ఆరోపించారు. ఈ ఫిర్యాదు మేరకు వరుణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వరుణ్ మద్రాసు హైకోర్టులో ముందస్తు బెయిలుకు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిం ది. ఇలా ఉండగా సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో చెన్నై సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టులో వరుణ్ సోమవారం లొంగిపోయారు. తర్వాత బెయిలు కోరుతూ అపీలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచార ణ జరిపిన న్యాయమూర్తి శాంతి ఆయ న పిటిషన్‌ను తోసిపుచ్చారు. అంతేకాకుండా వరుణ్‌ను మే 12వ తేదీ వరకు కోర్టు కస్టడీలో ఉంచాల్సిందిగా ఉత్తర్వులిచ్చారు. వరుణ్ తల్లి ఒక అపీలు పిటిషన్ దాఖలు చేసి, ఈ పిటిషన్‌ను అత్యవసర కేసుగా విచారణ జరపాలంటూ కోరారు. ఈ అపీల్ పిటిషన్‌పై ఈ నెల 30వ తేదీ విచారణ జరుగుతుంద ని మేనిస్ట్రేట్ ప్రకటించారు. వరుణ్ కుమార్‌ను జైలుకి తీసుకువెళ్లారు.