బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ, మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి లైంగిక దాడి, వైరలైన అభ్యంతర వీడియోల వ్యవహారంపై కేసు నమోదైంది. ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. తాజాగా తొలిసారి ఈ వ్యవహారంపై మాజీ ప్రధాని దేవెగౌడ స్పందించారు. ‘‘ప్రజ్వల్ రేవణ్ణపై నేరం నిరూపణ అయి దోషిగా తేలితే.. చర్యలు తీసుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. హెచ్‌డీ రేవణ్ణపై మహిళల వేధింపు, కిడ్నాప్ కేసులు కావాలని సృష్టించినవి’ అని దేవెగౌడ్ అన్నారు.
‘‘హెచ్ డీ రేవణ్ణకు సంబంధించిన కేసు కోర్టు ఉంది. అందుకే నేను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. ప్రజ్వల్ విదేశంలో ఉన్నాడు. ఈ వ్యవహరంలో చట్టపరంగా చర్యలు తీసుకోవటం ప్రభుత్వం విధి. మహిళ వేధింపుల కేసులో ఇంకా చాలా మందికి సంబంధం ఉంది. నేను ఎవరీ పేరును బయటపెట్టాలనుకోవటం లేదు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని, వారికి నష్ట పరిహారం అందిచాలని ఇప్పటికే హెచ్‌డీ కుమారస్వామి పేర్కొన్నారు’’ అని దేవెగౌడ అన్నారు.
ఇక.. ప్రజ్వల్‌కు సంబంధించిన లైంగిక దాడి కేసులో కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనుసాగుతోంది. అభ్యంతరమైన వీడియోలు వైరల్ అయిన అనంతరం జర్మనీ వెళ్లిపోయిన ప్రజ్వల్ ఇంకా భారత్‌కు తిరిగిరాకపోవటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment