రేపు జిల్లాకు కేసీఆర్ రాక... | District Leadership arrival tomorrow ... | Sakshi
Sakshi News home page

రేపు జిల్లాకు కేసీఆర్ రాక...

Sep 17 2014 1:51 AM | Updated on Sep 2 2017 1:28 PM

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలో వివిధ పరిశ్రమల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం జిల్లాకు వస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :
 జిల్లాలో వివిధ పరిశ్రమల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం జిల్లాకు వస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూలును జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మంగళవారం మీడియాకు విడుదల చేశారు. జిల్లాలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తారని కలెక్టర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న కేసీఆర్ సుమారు నాలుగున్నర గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం పోలేపల్లి సెజ్‌లో మౌలిక సౌకర్యాలను పరిశీలించడంతో పాటు కొత్తగా నిర్మించిన 132 కేవీ సామర్థ్యం కలిగిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. రూ.30కోట్లతో సెజ్ ఆవరణలో చేపట్టే అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆయా ప్రదేశాలను బుధవారం జిల్లా ఎస్పీతో కలిసి ఏర్పాట్లను సమీక్షిస్తున్నట్లు కలెక్టర్ ప్రియదర్శిని వెల్లడించారు.
 సీఎం రాకకు ఏర్పాట్లు 
 అడ్డాకుల: రేపు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండలంలోని వేముల కొజెంట్ గ్లాస్ కంపెనీకి వస్తున్న నేపథ్యంలో మంగళవారం కంపెనీలో ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు. వనసర్తి డీఎస్పీ జె.చెన్నయ్య, నాగర్‌కర్నూల్ ఆర్డీఓ వీరారెడ్డి, కొత్తకోట సీఐ రమేష్‌బాబు కంపెనీలో హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. సీఎం మాట్లాడేందుకు ఏర్పాటుచేసే సభ విషయమై చర్చించారు. కంపెనీ లోపల గ్లాస్ తయారుచేసే యంత్రాల వద్దకు సీఎం వెళ్లాల్సి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను డీఎస్పీ చెన్నయ్య కంపెనీ ప్రతినిధులకు వివరించారు. ఆయన వెంట అడ్డాకుల తహశీల్దార్ జె.రాంకోటి, ఎస్‌ఐ ముత్తినేని వెంకటేశ్వర్లు, స్థానిక సర్పంచ్ దాసరి వాణి, ఆర్‌ఐ శ్రీనివాస్, వీఆర్‌ఓలు దేవరాజ్, కుర్మయ్య ఉన్నారు. అదేవిధంగా మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పర్యవేక్షించారు. కంపెనీ ప్రతినిధి అక్షయ్‌సింగ్‌తో 
 
 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement