kChandrasekharrao
-
ప్రగతి భవన్‌ను అంబేడ్కర్ బహుజన్ భవన్‌గా మారుస్తాం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్‌ను అంబేడ్కర్ బహుజన్ భవన్‌గా మార్చుతామని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీలో సీఎం ఎవరైనా సరే టీపీసీసీ అధ్యక్షుడిగా తాను సీఎంగా ఉన్న వారితో దళిత, గిరిజనుల విద్య, అభివృద్ధి కోసం మొదటి సంతకం చేయిస్తానని చెప్పారు. బడ్జెట్లో అధిక ప్రాధాన్యం దళిత, గిరిజనుల అభివృద్ధికే కేటాయిస్తామన్నారు. బుధవారం మూడుచింతలపల్లిలోని దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా బుధవారం సాయంత్రం రేవంత్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి రెండు రోజుల దీక్షను విరమింపజేశారు. సీఎంగా కేసీఆర్ రాజభోగాలు అనుభవిస్తున్న ప్రగతిభవన్‌ను అంబేడ్కర్ బహుజన్ భవన్‌గా మార్చి అక్కడి నుంచే విద్యార్థులను ఉన్నత శిఖరాలకు వెళ్లేలా చేస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దత్తత పేరుతో దగా.. సీఎం కేసీఆర్ దత్తత పేరుతో గ్రామాలను దగా చేశారే తప్ప ఏమాత్రం అభివృద్ధి చేయలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. మూడుచింతలపల్లిని దత్తత తీసుకునే సమయంలో అది చేస్తా, ఇది చేస్తా అని ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ చేయలేదన్నారు. సీఎం దత్తత గ్రామాలపై తాను చర్చకు సిద్ధమని, అభివృద్ధి జరిగినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరినా అధికారంలో ఉన్న ఏ ఒక్కరూ స్పందించకపోవడం విడ్డూరమన్నారు. పేదల పిల్లలు చదువుకుంటే రాజ్యాధికారం అడుగుతారని, చైతన్యవంతులు అవుతారని.. అందువల్లే సీఎం కేసీఆర్ 4,632 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, కాలేజీలు మూసివేయించారని ఆరోపించారు. తండ్రి ఓ మాట, కొడుకో మాట హుజూరాబాద్‌లో ఓటమి భయం పట్టుకుందని అందుకే సీఎం కేసీఆర్ ఒకటంటే.. ప్రెస్మీట్లో కుమారుడు కేటీఆర్ మరోటి అంటున్నారని రేవంత్‌రెడ్డి అన్నా రు. కాంగ్రెస్ దండోరా సభలతో కేసీఆర్ అనే ఎలుక బయటికొచ్చిందని వ్యాఖ్యానిం చారు. కేసీఆర్ జపాన్ ఎలుకలాంటి వాడని. ప్రమాదాన్ని ముందే గ్రహించి ఫామ్‌హౌస్ నుంచి బయటికొచ్చారని ఎద్దేవా చేశారు. తాను జీవితంలో సుఖంగా జీవిం చేందుకు దేవుడు అన్నీ ఇచ్చాడని, తనకు పదవుల ఆశ లేదని చరిత్రలో గుర్తుండేలా నిలిస్తే చాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిటీ మేనేజ్మెంట్ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల ఇన్చార్జి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క తదితరులు ప్రసంగించారు. రాష్ట్ర నాయకులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, మల్లు రవి, నందికంటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మల్లారెడ్డి వేదిక ఎక్కితే జోకర్... బయట ఉంటే బ్రోకర్ మంత్రి మల్లారెడ్డి వేదిక ఎక్కితే జోకర్.. బయట ఉంటే బ్రోకర్ అని రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని భూ కబ్జాలకు పాల్పడుతున్నాడన్నారు. నియోజకవర్గంలో ఎవరు భూములు అమ్మినా, కొన్నా ఆయన మామూళ్లు వసూలు చేస్తారని ఆరోపించారు. జవహర్‌నగర్‌లో 268 సర్వే నంబర్లో తప్పుడు పత్రాలు సృష్టించి తన కోడలు పేరుతో ఆస్పత్రి నిర్మించారని, సూరారంలో చెరువును కబ్జా చేసి ఆస్పత్రి నిర్మించారని, మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీకి కేటాయించిన భూమిలో తన బావమరిది శ్రీనివాస్‌రెడ్డి పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని ధ్వజమెత్తారు. మంత్రి, తన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, కుమారులు, బావమరిది ఇలా కుటుంబమంతా కబ్జాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే మల్లారెడ్డి అక్రమాలపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. మల్లారెడ్డి అక్రమాలను తాను నిరూపిస్తానని, రుజువు చేయలేకపోతే ఏ శిక్ష విధించినా అంగీకరిస్తానని చెప్పారు. చదవండి: పదిసార్లు తిరిగినా.. కళ్లకు కనిపిస్తలేనా.. పింఛన్ ఎందుకివ్వరు? -
రెండో విడత గొర్రెల పంపిణీకి రూ.6 వేల కోట్లు: సీఎం కేసీఆర్
-
కేసీఆర్ పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు
-
కేసీఆర్ ఒక్క కేసు పెడితే.. నేను నాలుగు పెడతా: చంద్రబాబు
సాక్షి, అమరావతి: తాను తలాతోక లేకుండా మాట్లాడుతున్నాని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆదివారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు.. కేసీఆర్ పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే తాము కాంగ్రెస్‌తో కలిశామన్న చంద్రబాబు.. గతంలో తాను ఎన్టీఆర్ నుంచి టీడీపీని లాక్కున్నప్పుడు కేసీఆర్ కూడా తనతోనే ఉన్నారని, ఆ తర్వాతనే ఆయన మంత్రి అయ్యారని బాబు అన్నారు. కేసీఆర్ బెదిరించడానికి యత్నిస్తున్నారని, అందుకు తానేమీ భయపడే ప్రసక్తే లేదన్నారు. ఒకవేళ కేసీఆర్ ఒక్కకేసు పెడితే తాను నాలుగు కేసులు పెడతానన్నారు. బంగారు గుడ్లుపెట్లే తెలంగాణను వదిలేసినప్పటికీ తనపై కేసీఆర్ అక్కసు వెల్లగక్కుతున్నారని మండిపడ్డారు. తనను చెత్త పొలిటీషియన్ అని, కాంగ్రెస్ నాయకులును ఇడీయట్స్ అని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. హరికృష్ణ చనిపోయినప్పుడు టీఆర్ఎస్ పొత్తు కోసం అడిగానని, ఇద్దరం కలిసి పని చేద్దామని అన్నానన్నారు. అందులో తప్పేముందని చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరతాం -
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి కోవింద్
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరిన కోవింద్ నగరంలోని హకీంపేట్ విమానశ్రయానికి చేరుకున్నారు. కోవింద్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డీలు స్వాగతం పలికారు. శీతాకాల విడిదిలో భాగంగా ఆయన హైదరాబాద్‌లో నాలుగు రోజులపాటు ఉండనున్నారు. -
రేపు జిల్లాకు కేసీఆర్ రాక...
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలో వివిధ పరిశ్రమల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం జిల్లాకు వస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూలును జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మంగళవారం మీడియాకు విడుదల చేశారు. జిల్లాలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తారని కలెక్టర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న కేసీఆర్ సుమారు నాలుగున్నర గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం పోలేపల్లి సెజ్‌లో మౌలిక సౌకర్యాలను పరిశీలించడంతో పాటు కొత్తగా నిర్మించిన 132 కేవీ సామర్థ్యం కలిగిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. రూ.30కోట్లతో సెజ్ ఆవరణలో చేపట్టే అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆయా ప్రదేశాలను బుధవారం జిల్లా ఎస్పీతో కలిసి ఏర్పాట్లను సమీక్షిస్తున్నట్లు కలెక్టర్ ప్రియదర్శిని వెల్లడించారు. సీఎం రాకకు ఏర్పాట్లు అడ్డాకుల: రేపు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండలంలోని వేముల కొజెంట్ గ్లాస్ కంపెనీకి వస్తున్న నేపథ్యంలో మంగళవారం కంపెనీలో ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు. వనసర్తి డీఎస్పీ జె.చెన్నయ్య, నాగర్‌కర్నూల్ ఆర్డీఓ వీరారెడ్డి, కొత్తకోట సీఐ రమేష్‌బాబు కంపెనీలో హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. సీఎం మాట్లాడేందుకు ఏర్పాటుచేసే సభ విషయమై చర్చించారు. కంపెనీ లోపల గ్లాస్ తయారుచేసే యంత్రాల వద్దకు సీఎం వెళ్లాల్సి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను డీఎస్పీ చెన్నయ్య కంపెనీ ప్రతినిధులకు వివరించారు. ఆయన వెంట అడ్డాకుల తహశీల్దార్ జె.రాంకోటి, ఎస్ఐ ముత్తినేని వెంకటేశ్వర్లు, స్థానిక సర్పంచ్ దాసరి వాణి, ఆర్ఐ శ్రీనివాస్, వీఆర్ఓలు దేవరాజ్, కుర్మయ్య ఉన్నారు. అదేవిధంగా మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పర్యవేక్షించారు. కంపెనీ ప్రతినిధి అక్షయ్సింగ్తో