
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరిన కోవింద్ నగరంలోని హకీంపేట్ విమానశ్రయానికి చేరుకున్నారు. కోవింద్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డీలు స్వాగతం పలికారు. శీతాకాల విడిదిలో భాగంగా ఆయన హైదరాబాద్‌లో నాలుగు రోజులపాటు ఉండనున్నారు.