న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త ఓటరు కార్డు అందుకున్నారు. ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పి.కృష్ణమూర్తి స్వయంగా మంగళవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్‌కు వచ్చి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కొత్త ఓటరు కార్డు అందజేశారు.
ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి పి.కృష్ణమూర్తి నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త ఓటరు కార్డు అందుకున్నట్లు పేర్కొంది.
ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము గత ఏడాది జులై 25న భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆమె తన ఓటు హక్కును ఒడిశా నుంచి ఢిల్లీకి మార్చుకున్నారు. ఇందు కోసం ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి కృష్ణమూర్తి నవంబర్ 10న రాష్ట్రపతి భవన్‌ను సందర్శించి సహకారాన్ని అందించినట్లు అధికారులు తెలిపారు.
President Droupadi Murmu received her Voter ID card from Shri P. Krishnamurthy, Chief Electoral Officer of Delhi, at Rashtrapati Bhavan. pic.twitter.com/yE2tTXhzq4
— President of India (@rashtrapatibhvn) November 28, 2023
Comments
Please login to add a commentAdd a comment