భార్యకు స్పెషల్‌గా విష్ చెప్పిన టాలీవుడ్‌ హీరో.. పోస్ట్ వైరల్! | Tollywood Hero Sudheer Babu Remember His Special Photo In Tweet | Sakshi
Sakshi News home page

Sudheer Babu: భార్యకు సుధీర్‌ బాబు స్పెషల్‌ విషెస్‌.. పోస్ట్ వైరల్!

May 29 2024 3:55 PM | Updated on May 29 2024 4:37 PM

Tollywood Hero Sudheer Babu Remember His Special Photo In Tweet

టాలీవుడ్ యంగ్‌ హీరో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సుధీర్‌ బాబు హీరోగా నటించిన చిత్రం హరోం హర. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో మాళవిక శర్మ జంటగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని మే 31న రిలీజ్‌ చేయాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా వేశారు. వచ్చేనెల జూన్‌ 14న రిలీజ్ చేయనున్నట్లు సుధీర్‌బాబు ప్రకటించారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

అయితే సుధీర్‌ బాబు.. సూపర్ స్టార్‌ కృష్ణ కూతురు ప్రియదర్శినిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే సుధీర్, ప్రియదర్శినిల పెళ్లి మే 29,0 2006లో ఘనంగా జరిగింది. తాజాగా వివాహా వార్షికోత్సవం సందర్భంగా అరుదైన ఫోటోను పంచుకున్నారు సుధీర్. తన భార్య ప్రియదర్శిని పెళ్లిచూపుల ఫోటోను ట్విటర్‌లో పంచుకున్నారు. ఈ సందర్భంగా వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.  నాతో ఉన్నప్పటి తన మొదటి ఫోటో.. అంతేకాదు పెళ్లిచూపుల ఫోటో అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు హీరో జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement