
జస్టిస్ ప్రియదర్శినికి స్వామివారి చిత్రపటం అందిస్తున్న ఆలయ ఏఈవో
యాదమరి (చిత్తూరు జిల్లా): కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శిని సోమవారం దర్శించుకున్నారు. ఉదయం ఆమె కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనార్థం కాణిపాకం విచ్చేయగా ఆలయ ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు.
అనంతరం ఆశీర్వాద మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి, ఇన్‌స్పెక్టర్ బాబు పాల్గొన్నారు.