
ఇద్దరి పిల్లలతో కలిసి బెంగళూరులో ఓ డాక్టర్ దారుణం
యశవంతపుర: బెంగళూరులోని ఓ వైద్యురాలు తన ఇద్దరు పిల్లలతో కలిసి వృద్ధులైన అత్తమామలపై విచక్షణారహితంగా దాడిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న డాక్టర్ ప్రియదర్శిని, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈనెల 10వ తేదీ రాత్రి తన అత్తమామలపై పైశాచికంగా దాడిచేశారు.
ఈ వీడియో చూసి నెటిజన్లు భగ్గుమన్నారు.. దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ‘ఎక్స్’లో డిమాండ్ చేస్తూ ఈ పోస్టును బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌కు ట్యాగ్ చేశారు. బాధిత వృద్ధుడు జె.నరసింహయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రియదర్శినిపై కేసు నమోదు చేశారు. తన కొడుకు నవీన్‌కుమార్, కోడలు ప్రియదర్శిని విడాకులు తీసుకోడానికి 2007లో ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారని.. కేసు చివరి దశకు చేరుకున్న సమయంలో ఆమె ఈ దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment