Shilpa Choudhary Cheating Case: అధిక వడ్డి ఇప్పిస్తానంటూ పలువురు సెలబ్రెటీ వద్ద కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి చీటింగ్ కేసులో రోజురోజుకు కీలక విషయాలు బయట పడుతున్నాయి. ఆమె చేతిలో మోసపోయిన సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి, యంగ్ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కిట్టి పార్టీల పేరుతో శిల్ప తన దగ్గర సుమారు 3 కోట్ల రూపాయలు తీసుకుని ఇవ్వడం లేదంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు శిల్పను మరోసారి కస్టడిలోకి తీసుకుని ఆరా తీస్తున్నారు.
చదవండి: పోలీసులను ఆశ్రయించిన మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని
ఈ క్రమంలో శిల్ప చేతిలో మోసపోయానంటూ మరో టాలీవుడ్ సెలబ్రెటీ బయటకు వచ్చాడు. యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి శిల్ప మాయమాటలు నమ్మి నట్టేట మునిగాడు. కిట్టి పార్టీ పేరుతో మాయ మాటలు చెప్పి శిల్ప తన దగ్గర రూ. 3 కోట్లు వసూలు చేసిందట. ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తొందంటూ ఈ యంగ్ హీరో పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. కాగా ‘సెహరి’ సినిమాతో హర్ష్ కనుమల్లి హీరోగా పరిచయమయ్యాడు. వీరితో పాటు మరో స్టార్ హీరో కూడా శిల్ప బాధితుల్లో ఉన్నట్లు సమాచారం. కాగా కిట్టి పార్టిలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో శిల్పా చౌదరి సెలబ్రెట్రీలతో పాటు నగరానికి చెందిన ప్రముఖుల వద్ద దాదాపు రూ. 200 కోట్లు రూపాయలు వసూలు చేశారు.
చదవండి: అన్నయ్యను ఇలా పరిచయం చేస్తాననుకోలేదు: హీరో ఆవేదన
ఆమె మాయమాటలకు ప్రముఖ టాలీవుడ్ హీరో కుటుంబం కూడా రూ. 12 కోట్లు మోసపోయినట్లు సమాచారం. వారు టాలీవుడ్ అగ్రహీరోకు అత్యంత ఆప్తులుగా తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి కోసం ఒక్కొక్కరి వద్ద రూ. 6 కోట్ల చొప్పున మొత్తం 12 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. మరో సీనియర్ నటుడు కూడా రూ. 2.4 కోట్లు మోసపోయినట్లు సమాచారం. శిల్పా చౌదరి బాగోతాలు వెలుగులోకి రావడంతో బాధితులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర పోలీస్ స్టేషన్‌ల్లో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: వైరల్ అవుతోన్న కమెడియన్ రఘు షాకింగ్ వీడియో!
కాగా యంగ్ హీరో సుధీర్‌బాబు భార్య ప్రియదర్శిని దగ్గర 2 కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకుని మూడు నకిలీ చెక్కులు, నకిలీ బంగారాన్ని ష్యూరిటీ కింద ఇచ్చినట్టు బయట పడింది. చెక్కు మార్చేందుకు ఇండియన్ బ్యాంక్‌కు వెళ్లిన ప్రియదర్శిని.. మోసపోయినట్టు తెలుసుకుని అవాక్కయింది. దీంతో పోలీసులను ఆశ్రయించింది. శిల్పా చౌదరి 50 కోట్ల రూపాయలు హవాలా ద్వారా దుబాయ్ తరలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శిల్పా చౌదరికి చెందిన 6 బ్యాంక్ అకౌంట్స్‌పై నార్సింగ్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment