ప్రియదర్శినికి కాంస్యం | Telangana Weightlifter Priyadarshini Won Bronze Medal In Senior National Weightlifting Championship | Sakshi
Sakshi News home page

ప్రియదర్శినికి కాంస్యం

Published Wed, Feb 5 2020 3:11 AM | Last Updated on Wed, Feb 5 2020 3:11 AM

Telangana Weightlifter Priyadarshini Won Bronze Medal In Senior National Weightlifting Championship - Sakshi

కోల్‌కతా: జాతీయ సీనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ వెయిట్‌లిఫ్టర్‌ ప్రియదర్శిని కాంస్య పతకం సాధించింది. మంగళవారం జరిగిన మహిళల 49 కేజీల విభాగంలో ప్రియదర్శిని మొత్తం 168 కేజీల (స్నాచ్‌లో 70+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 98) బరువెత్తి మూడో స్థానంలో నిలిచింది. మీరాబాయి జాతీయ రికార్డు: 49 కేజీల విభాగంలోనే భారత స్టార్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మణిపూర్‌కు చెందిన 25 ఏళ్ల మీరాబాయి మొత్తం 203 (స్నాచ్‌లో 88+ క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115) కేజీలు బరువెత్తి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 201 కేజీలతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. రైల్వేస్‌కే చెందిన మరో వెయిట్‌లిఫ్టర్‌ సంజిత చాను మొత్తం 185 కేజీలు (స్నాచ్‌లో 80+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 105) బరువెత్తి రజత పతకాన్ని దక్కించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement