
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో సోమవారం తెలంగాణ జట్టు ఖాతాలో మరో పతకం చేరింది. జిమ్నాస్టిక్స్ అండర్–21 బాలుర రోమన్ రింగ్స్ విభాగంలో సూర్యదేవ్ కాంస్య పతకం సాధించాడు. సూర్యదేవ్ 11.70 పాయింట్లు స్కోరు చేశాడు. పామెల్ హార్స్ ఈవెంట్‌లో తెలంగాణకే చెందిన విశాల్ జాదవ్ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు.
Comments
Please login to add a commentAdd a comment