Mahesh Babu Sister Sudheer Babu Wife Priya Darshini Birthday Celebrations: సూపర్‌స్టార్ మహేశ్ బాబు చెల్లెలు, హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని ఘట్టమనేని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంట్లోనే కుటుంబసభ్యుల మధ్య బర్త్‌డే సెలబ్రేషన్స్ జరిగాయి. సూపర్ స్టార్ కృష్ణతో, మంజుల సహా పలువురు కుటుంబ సభ్యుల మధ్య ప్రియదర్శిని కేక్ కట్ చేసి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: సమంత ఇన్‌స్టా పోస్ట్.. పర్సనల్ లైఫ్ గురించేనా?
సుధీర్‌బాబు సైతం భార్యకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టును షేర్‌చేశారు. 'హ్యాపీ బర్త్‌డే ప్రియ..నీతో ప్రతీ సంవత్సరం మునుపటి ఏడాది కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రతిరోజూ కుటుంబాన్ని ఎంతో సంతోషంగా చూసుకుంటూ ప్రేమను పంచుతున్నందుకు ధన్యవాదాలు' అంటూ శ్రీమతికి ప్రేమగా బర్త్‌డే విషెస్‌ను తెలియజేశారు. చదవండి: హీరోయిన్ కాజల్ ముఖ్యమైన ప్రకటన..ఇన్‌స్టాలో పోస్ట్
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment