కరాటే... కుంగ్‌ఫూ తప్పనిసరి!
మనోజ్ నందం, ప్రియదర్శిని జంటగా వేముగంటి దర్శకత్వంలో రంజిత్ నిర్మిస్తున్న చిత్రం ‘యూత్‌ఫుల్ లవ్’. శ్రీకాంత్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత దామోదర ప్రసాద్ ఆడియో సీడీని ఆవిష్కరించి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలందజేశారు. ఈ వేడుకలో కేవీవీ సత్యనారాయణ, సునీల్‌కుమార్‌రెడ్డి, శ్రీ, శోభారాణి, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘తమకు ఎదురవుతున్న చేదు అనుభవాలను ధైర్యంగా ప్రతిఘటించాలంటే మహిళలు చదువుతోపాటు కరాటే, కుంగ్‌ఫూల్లాంటి విద్యలు కూడా నేర్చుకోవాలని చెప్పే చిత్రం ఇది’’ అన్నారు. మంచి సందేశం ఉన్న యూత్‌ఫుల్ మూవీ ఇదని, యూత్‌కి బాగా
కనెక్ట్ అయ్యే చిత్రమని రంజిత్ చెప్పారు. అబ్బాయిలు, అమ్మాయిలు... ఎవరికైనా సెల్ఫ్ డిఫెన్స్ అవసరమని చెప్పే చిత్రమని మనోజ్ నందం తెలిపారు. తెలుగులో చేసి రెండోచిత్రమని ప్రియదర్శిని అన్నారు.